ఫార్మా రంగానికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారాలు అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
ఇటీవల కొంత మంది ఫార్మా రంగం ప్రతినిధులతో సమావేశమయ్యా.. ఈ రంగానికి బాసటగా నిలుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy
BioAsia Summit 2024 : ఫార్మా రంగానికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్ సీసీలో 21వ బయో ఆసియా – 2024 సదస్సు మంగళవారం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో సవాళ్లను నేను అర్థం చేసుకోగలను.. ఇటీవల కొంత మంది ఫార్మా రంగం ప్రతినిధులతో సమావేశమయ్యా.. ఈ రంగానికి బాసటగా ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు. ప్రపంచంలో మూడు కొవిడ్ వ్యాక్సిన్ లు వచ్చాయి.. వాటిలో ఒక వ్యాక్సిన్ ను అందించిన ఘనత హైదరాబాద్ కు దక్కిందని రేవంత్ రెడ్డి కొనియాడారు.
Also Read : Bandla Ganesh : ఏపీ మంత్రి రోజా, కేటీఆర్‌పై బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు..
ఎన్నో పరిశోధనలకు నిలయంగా హైదరాబాద్ ఉందని, జాతీయ, అంతర్జాతీయ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించడంతోపాటు ఎంఎస్ఎంఈలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రేవంత్ తెలిపారు. జీవనవైవిధ్యం, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులపై ఈ సదస్సులో చర్చించనున్నారు. పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు , చేయూతపై నిర్ణయాలు తీసుకోనున్నారు.