CM Revanth Reddy Review : ఎట్టిపరిస్థితుల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం..!

ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం.. మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నిక అభ్యర్థిది కాదు.. ముఖ్యమంత్రిది.. నా బలం.. నా బలగం మీరే.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులదే..

CM Revanth Reddy Review : ఎట్టిపరిస్థితుల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం..!

CM Revanth Reddy Review on Malkajgiri Parliament Constituency

CM Revanth Reddy Review : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఎప్పటికప్పుడూ సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ఈ క్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ నేతలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి.. లోక్​సభ ఎన్నికల్లో నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమని, మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నిక అభ్యర్థిది కాదని, ముఖ్యమంత్రిది అన్నారు. నా బలం.. నా బలగం మీరేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని నేతలకు పార్టీ నేతలకు సూచనలు చేశారు.

Read ALso : నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే

దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం :
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులదేనని చెప్పారు. ఈ నియోజకవర్గ కార్యకర్తలు తమ భుజాలపై మోసి గెలిపించి ఢిల్లీకి పంపించారని, 2,964 బూత్‌లలో ప్రతీ బూత్‌లో ఒక సైనికుడిలా కార్యకర్తలు పనిచేశారని రేవంత్ పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి.. నాటి మల్కాజిగిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి సీఎం స్థాయికి ఎదిగేలా చేసిందన్నారు.
కేసీఆర్ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైందని చెప్పారు.

సమస్యలు తీరాలంటే ఇక్కడ గెలిచి తీరాల్సిందే :
వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టామన్న ఆయన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10లక్షలకు పెంపు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.

మల్కాజిగిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి.. స్కైవేల నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తున్నామని తెలిపారు. మెట్రో, ఎంఎంటీఎస్ రావాలన్నా.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరాలన్నా కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రమంతా తుఫాను వచ్చినట్లు గెలిచినా మల్కాజిగిరి పార్లమెంట్‌లో ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలు గెలిస్తే.. అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేదన్నారు.

అందుకే మల్కాజిగిరిలో కాంగ్రెస్ గెలవాలి :
అందుకే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని రేవంత్ అన్నారు. అప్పుడే మల్కాజిగిరి ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పార్లమెంట్‌తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవాలని ఆకాంక్షించారు. హొలీ పండగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందని, కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాదని రేవంత్ పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌కు కుబలమైన నాయకత్వం ఉందని, సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఏడో అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన అభ్యర్థులు ఒక ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలన్నారు. వారికి పోలింగ్ బూత్‌ల వారీగా పని విభజన చేసుకుని సమీక్ష చేసుకోవాలని తెలిపారు. శుక్రవారం సాయంత్రం కంటోన్మెంట్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవాలని, ఉదయం 7 గంటలకే నాయకులు బస్తీ బాట పట్టాల్సిందేనని సూచించారు. ప్రణాళికబద్దంగా ప్రచారం నిర్వహించుకోవాలని, మల్కాజిగిరి క్యాంపెయిన్ మోడల్ రాష్ట్రమంతా అనుసరించేలా నిర్వహించాలన్నారు.

Read ALso : Gedam Nagesh : మద్దతివ్వండి ప్లీజ్‌.. సొంత పార్టీ నేతలకే అభ్యర్ధి వేడుకోలు, ఆదిలాబాద్‌ బీజేపీలో అసమ్మతి రాగం