CM Revanth Reddy : యశోద ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు.

CM Revanth Reddy (1)
CM Revanth Reddy Visit Yashoda Hospital : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డికి వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు వివరించారు.
కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు.
KCR : కేసీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతం
ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆస్పత్రిలోనే ఉన్నారు. కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ జరిగింది. ఇటీవల కేసీఆర్ కు వైద్యులు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఫిజియోథెరపీ టీమ్ పర్యవేక్షణలో వాకర్ సాయంతో కేసీఆర్ నడుస్తున్నారు. క్రమంగా కేసీఆర్ కోలుకుంటున్నారు.
శుక్రవారం(డిసెంబర్ 8, 2023)న యశోద ఆస్పత్రిలో కేసీఆర్ కు శస్త్రచికిత్స జరిగింది. యశోద ఆస్పత్రి వైద్యులు కేసీఆర్ కు శస్త్రచికిత్స చేసి తుంటి ఎముకను మార్చారు. నాలుగన్నర గంటల పాటు శస్త్రచకిత్స కొనసాగింది. వ్యవసాయం క్షేత్రంలోని నివాసంలో కేసీఆర్ కాలు జారి పడ్డారు. దీంతో ఆయన ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు.
KCR Health : కోలుకుంటున్న కేసీఆర్.. వాకర్ సాయంతో నడిపించిన వైద్యులు.. వీడియో షేర్ చేసిన బీఆర్ఎస్
అయితే ఈ ప్రమాదంతో గతంలో విరిగిన కాలు గాయం మరోసారి తిరబడిందని వైద్యులు తెలిపారు. వెంటనే ఆయనను యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కేసీఆర్ కు శస్త్రచికిత్స నిర్వహించారు. అంతకముందు కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి వెంటనే యశోద ఆస్పత్రికి వెళ్లారు. రాత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వెంటనే ప్రభుత్వం స్పందించింది. వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో పోలీస్ అధికారుల భద్రత నడుమ ఆస్పత్రికి తరలించారు. అనంతరం యశోద ఆస్పత్రికి వైద్యులు కేసీఆర్ కు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంది. ఆయన క్రమంగా కోలుకుంటున్నారు.