Hyderabad : భాగ్యనగరంలో చుక్కలు చూపిస్తున్న క్యాబ్ ధరలు.. వర్షాల్ని క్యాష్ చేసుకుంటున్న యజమానులు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భాగ్యనగరంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వర్షాల కారణంగా గమ్యస్ధానాలకు చేరుకునేందుకు క్యాబ్‌లను ఆశ్రయిస్తున్న వారు లబోదిబో మంటున్నారు. సాధారణ రోజుల కంటే వర్షాల కారణంగా క్యాబ్ డ్రైవర్లు రెండింతల సొమ్ము వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad : భాగ్యనగరంలో చుక్కలు చూపిస్తున్న క్యాబ్ ధరలు.. వర్షాల్ని క్యాష్ చేసుకుంటున్న యజమానులు

Hyderabad

Updated On : July 20, 2023 / 6:57 PM IST

Hyderabad : తెలంగాణలో ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. ఇక ఈ వర్షాల్లో బయటకు వస్తున్న వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోనీ క్యాబ్‌లను ఆశ్రయిద్దామనుకుంటే వాటి ధరలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.

Heavy rains : తెలంగాణలో 3 రోజులుగా కురుస్తున్న భారీవర్షాలు… విద్యాసంస్థలకు సెలవులు

చిన్నపాటి వర్షానికి భాగ్యనగరంలో జనం ఇబ్బందులు మామూలుగా ఉండవు. కొన్నిచోట్ల రోడ్లు చెరువుల్ని తలపిస్తాయి. ఇక ట్రాఫిక్ సంగతి సరేసరి. భారీ ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికుల అవస్థలు చెప్పనలవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాబ్‌లను ఆశ్రయిస్తే ఇక వాటి ధరలు చూసి జనం షాకవుతున్నారు. సాధారణ రోజుల్లో ఉండే క్యాబ్ ధరలతో పోలిస్తే వాటికి రెండింతలు, మూడింతలు ధరలు వసూలు చేస్తున్నారు.

బేగంపేట నుంచి ఎయిర్‌పోర్టుకి వెళ్లాలంటే మామూలు రోజుల్లో రూ.700 నుంచి రూ.800 ఉంటుంది. ఈ వర్షాల కారణంగా దానికి డబుల్ రేట్లు పలుకుతున్నాయి. పోనీ ధర తగ్గించమని బేరాలు ఆడితే క్యాబ్ డ్రైవర్లు రైడ్‌ను క్యాన్సిల్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో క్యాబ్‌లలో వెళ్లాలంటే సామాన్యుడికి అందని ధరలు పలుకుతూ భయపెడుతున్నాయి. తాజాగా @AnujGurwara అనే ట్విట్టర్ యూజర్ తన స్వీయ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. పలువురు తమకు ఎదురైన అనుభవాలను షేర్ చేసుకున్నారు.

Heavy Rains : రానున్న ఐదు రోజులు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

తెలంగాణ వ్యాప్తంగా ఆగకుండా వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.