Bharat Jodo Yatra in Telangana: తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో యాత్ర.. ఘన స్వాగతం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటకలోని రాయచూర్ లో రాహుల్ పాదయాత్ర ముగిసింది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, స్థానికులు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తదితరులు కూడా పాల్గొన్నారు.

Bharat Jodo Yatra in Telangana: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటకలోని రాయచూర్ లో రాహుల్ పాదయాత్ర ముగిసింది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, స్థానికులు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తదితరులు కూడా పాల్గొన్నారు.
గూడెబల్లూరులో ఇవాళ రాహుల్ యాత్రకు బ్రేక్ పడుతుంది. ఆ తర్వాత ఈ నెల 27న ఉదయం గూడెబల్లూరు నుంచే రాహుల్ యాత్ర మళ్ళీ ప్రారంభం అవుతుంది. మొత్తం 12 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ యాత్ర ఉంటుంది. తెలంగాణలోని 19 అసెంబ్లీ, 7 పార్లమెంటరీ నియోకవర్గాల్లో మొత్తం కలిపి 375 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేస్తారు.
కాగా, ఈ నెల 26న ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఇప్పటికే రాహుల్ గాంధీ తమిళనాడు, ఏపీ, కర్ణాటకలో భారత్ జోడో యాత్ర ముగించుకున్నారు.
కర్ణాటక నుండి అభిమాన ఉత్తుంగతరంగాలు, తెలంగాణలో కృష్ణమ్మలో ఐక్యం అయిన వేళ!
ప్రజల అభిమాన వారధిపై, ఆ తల్లి పాదస్పర్శ చేస్తు, భారత దేశాన్ని ఏకం చేసే రాజసూయ యాగంలో ప్రతీ మనసు గెలుస్తూ తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ! @RahulGandhi #BharatJodoYatra#ManaTelanganaManaRahulGandhi pic.twitter.com/RqZaSaobCk
— Telangana Congress (@INCTelangana) October 23, 2022