Congress Committees: ఎట్టకేలకు తెలంగాణ పీసీసీలో కొత్త కమిటీలు.. 5 కమిటీలు ప్రకటించిన అధిష్టానం.. సభ్యులు వీరే..
కాంగ్రెస్ లో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

Congress Committees: ఎట్టకేలకు తెలంగాణ పీసీసీలో కొత్త కమిటీలను ఏర్పాటు చేసింది హస్తం హైకమాండ్. మొత్తం 5 కమిటీలను ప్రకటించింది. 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ నియమించింది. ఇక 15 మందితో అడ్వైజరీ కమిటీ, ఏడుగురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ, ఆరుగురితో క్రమశిక్షణ చర్యల కమిటీ నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది.
కాంగ్రెస్ లో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఉన్నారు.
వీరితో పాటు చల్లా వంశీచంద్ రెడ్డి, రేణుక చౌదరి, బలరాం నాయక్, షబ్బీర్ అలీ, మహమ్మద్ అజారుద్దీన్, ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్, పి సుదర్శన్ రెడ్డి, బీర్ల ఐలయ్య, జెట్టి కుసుమ్ కుమార్, ప్రేమ్ సాగర్ రావు, ఈరవత్రి అనిల్ కుమార్ ఉన్నారు. వీరితో పాటు క్యాబినెట్ మంత్రులంతా స్పెషల్ ఇన్వైటీస్ గా ఉంటారు.
అడ్వైజరీ కమిటీలో సభ్యులు..
మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, వి హనుమంతరావు, జానారెడ్డి, కేశవరావు, మధుయాష్కి గౌడ్, చిన్నారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, జఫ్ఫార్ జావేద్, జీవన్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్.
క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గా మల్లు రవి, వైస్ ఛైర్మన్ గా శ్యామ్ మోహన్, ఎం నిరంజన్ రెడ్డి, బి కమలాకర్ రావు, జఫ్ఫార్ జావిద్, జీవి రామకృష్ణ.