మళ్లీ తెరపైకి క్యాబినెట్ విస్తరణ.. మూడు పదవులపై చర్చ.. దక్కేది ఎవరికి..?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తో బేటీ అయ్యారు. తెలంగాణలో మిగిలిన మూడు మంత్రి పదవుల భర్తీపై చర్చించారు.

Telangana Congress
Telangana Congress: మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. హోటల్ తాజ్ కృష్ణాలో కేసీ వేణుగోపాల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో టీకాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. మిగిలిన మూడు మంత్రి పదువులు ఎవరికి ఇవ్వాలనే అంశంపై వీరి మధ్య చర్చజరిగినట్లు తెలుస్తోంది. క్యాబినెట్ కూర్పుతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపైనా చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా కుల గణన, బీసీ రిజర్వేషన్ కు సంబంధించి పార్టీ విధాన నిర్ణయంపై నేతల మధ్య చర్చ జరిగింది.
Also Read: KCR Health: కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్, బండి సంజయ్ ఆరా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మంత్రివర్గంలో మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా భర్తీచేసి పూర్తిస్థాయిలో క్యాబినెట్ ను కొనసాగించాలని కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మూడు పదవులకు పలువురు నేతలు పోటీ పడుతున్నారు. మంత్రి పదవులకోసం పోటీ పడుతున్న పలువురు నేతలు గురువారం మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. మరోవైపు పార్టీ ముఖ్యనేతలుసైతం మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయ్యి మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు తెలిసింది. తాజాగా.. శుక్రవారం కేసీ వేణుగోపాల్ తో మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ముఖ్యనేతలు భేటీ అయ్యారు.