Jana Reddy Illness : కాంగ్రెస్ నేత జానారెడ్డికి స్వల్ప అస్వస్థత

జానారెడ్డి మంగళవారం సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స చేశారు.

Jana Reddy Illness : కాంగ్రెస్ నేత జానారెడ్డికి స్వల్ప అస్వస్థత

Jana Reddy illness

Updated On : April 12, 2023 / 12:03 PM IST

Jana Reddy Illness : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం జానారెడ్డి స్పల్వ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం వెంటనే ఆయన్ను యశోద హాస్పిటల్ కి తీసుకెళ్లారు. జానారెడ్డికి డాక్టర్లు ఆంజియోగ్రామ్ టెస్టు చేశారు.

ప్రస్తుతం జానారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.  జానారెడ్డి మంగళవారం సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. గుండె సమస్య ఉండటంతో స్టంట్ వేసినట్లు అధికారులు చెబుతున్నారు.

Jana Reddy: మరోసారి అవకాశం ఇస్తే, చేయని పనులు పూర్తిచేసి స్వర్గానికి వెళ్తాను: జానారెడ్డి

మరోవైపు జానారెడ్డి త్వరలో మోకాలు ఆపరేషన్ చేయించుకోవాలని భావిస్తున్నారు. సింగపూర్ లో చికిత్స చేయించుకోనున్నారు. దానికి సంబంధించి అన్ని రకాల టెస్టులు చేయించుకుంటున్నారు.