Jagga Reddy: కాంగ్రెస్‌కి జగ్గారెడ్డి గుడ్ బై? నా వల్లే ప్రాబ్లమ్ ఐతే నేనెళ్లిపోతా!
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Jagga Reddy
Jagga Reddy: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సంగారెడ్డిలో తన ముఖ్య అనుచరులు, నాయకులతో రహస్య ప్రదేశంలో కీలక సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. తన భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడినట్లు తెలుస్తోంది.
నియోజకవర్గ ముఖ్యనేతలతో సమావేశమైన జగ్గారెడ్డి వారినుంచి కీలక సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. రాజకీయ భవిష్యత్‌పై రేపు(19 ఫిబ్రవరి 2022) కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
రేపు ఉదయం సంగారెడ్డిలో కార్యకర్తలతో భేటి కానున్నారు జగ్గారెడ్డి. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న జగ్గారెడ్డి.. పార్టీకి తన వల్లే ప్రాబ్లమ్ ఐతే వెళ్లిపోతా అని అన్నట్లుగా చెబుతున్నారు.