MLA Jaggareddy : జగ్గారెడ్డి దగ్గరకు వెళుతా.. అసంతృప్తి నాయకులను పీసీసీ చీఫ్ కలవాలి – వీహెచ్
జగ్గారెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చిన సందర్భంలో ఆయన్ను కలవడం జరిగిందన్నారు. తనను కోవర్టు అంటున్నారు.. నేనే వెళ్లిపోతానని అన్నారని దీంతో ఆయన్ను చాలా సేపు బుజ్జగించడం...

Revanth Reddy
Congress Senior Leader VH Meets MLA Jaggareddy : తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ అలజడి మొదలైంది. సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం పార్టీలో తీవ్ర కల్లోలం రేపుతోంది. 2022, ఫిబ్రవరి 19వ తేదీ శనివారం అనుచరులు, కార్యకర్తలతో ఉదయం 11 గంటలకు భేటీ అవుతున్నారు. భేటీ అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న జగ్గారెడ్డి పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు స్పందించారు. ఆయన 10tvతో మాట్లాడారు.
Read More : Sangareddy MLA : జగ్గారెడ్డి ఏం చెబుతారు ? పార్టీ కార్యకర్తలతో సమావేశం
గతంలో జగ్గారెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చిన సందర్భంలో ఆయన్ను కలవడం జరిగిందన్నారు. తనను కోవర్టు అంటున్నారు.. నేనే వెళ్లిపోతానని అన్నారని దీంతో ఆయన్ను చాలా సేపు బుజ్జగించడం జరిగిందన్నారు. ఎన్ని రోజులు అవమానం చేస్తారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారన్నారు. తాను ఒక సీనియర్ నాయకుడిగా బాధ్యతలు నెరవేరుస్తానని మరోసారి వెళ్లి జగ్గారెడ్డిని బుజ్జగించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీపై కీలక వ్యాఖ్యలు చేశారాయన. యుద్ధం పక్క పార్టీలతో చేయాలి.. సొంత పార్టీతో కాదని హితవు పలికారు. కేసీఆర్, మోదీపై యుద్ధం చేయాలని మొదటి నుంచి తాను చెప్పడం జరుగుతోందన్నారు. టీపీసీసీ చీఫ్ అందర్నీ కలుపుకుని పోవాలని సూచించారు.
Read More : Jaggareddy: జగ్గారెడ్డిని బుజ్జగించిన వీహెచ్
పార్టీలో తప్పులు జరిగినప్పుడు సీనియర్ నాయకుడిగా తన బాధ్యతలు నిర్వహిస్తానన్నారు. అందరితో సంప్రదింపులు జరిపితే బాగుంటుందని తాను సూచించడం జరుగుతుందన్నారు. జిల్లాల్లో కొన్ని తగదాలున్నాయని, దీనిని పరిష్కరించే బాధ్యత పీసీసీ అధ్యక్షులపై ఉందన్నారు. పార్టీలో ఒకరినొకరు పొడుచుకుంటే ఎలా అని ప్రశ్నించారు. తనకు కూడా అవమానం జరిగితే.. సర్దుకపోయానన్నారు. ప్రస్తుతం ఫోన్లలో తిట్టే ఆచారం మొదలైందని, వెంకట్ రెడ్డి దగ్గరకు రేవంత్ ఎందుకు వెళ్లారో తనకు తెలియదని.. అలాగే జగ్గారెడ్డి దగ్గరకు కూడా వెళ్లాలని వెల్లడించారు. అందర్నీ కలుపుకపోయే వ్యక్తి లీడర్ అవుతాడని, తనతో పాటు వచ్చిన వాళ్లనే చూస్తా.. ఇతరులను చూడనంటే కుదరదని వీహెచ్ తెలిపారు. మరి వీహెచ్ బుజ్జగింపులు పని చేస్తాయా ? జగ్గారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కాసేపట్లో తేలనుంది.