Revanth Reddy : పార్టీ ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీ చేస్తా.. ఎంఐఎంతో కలిసి వెళ్లే ప్రసక్తేలేదు : రేవంత్ రెడ్డి
వామపక్షాలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు.

TPCC Chief Revanth Reddy (3)
Revanth Reddy will Contest Against CM KCR? : టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలు హంగ్ అసెంబ్లీ ఇవ్వరని.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎంతో కలిసి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డిలో పోటీపై పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తానని చెప్పారు. కేసీఆర్ కొడంగల్ నుంచి పోటీ చేయాలని సవాల్ చేసినట్లు తెలిపారు.
కేసీఆర్ మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేస్తే కొడంగల్ కు రావాలన్నారు. కామారెడ్డి, అయినా సిరిసిల్ల అయినా ఎక్కడయినా తాను, బట్టి పోటీ చేస్తామని తెలిపారు. అధిష్టానం ఏది చేయమని ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కేసీఆర్ కి గుడ్ విల్ లేదదన్నారు. బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవచ్చు. అవసరమైతే కేఏ పాల్ తో కూడా పొత్తు పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు.
Amit Shah : అమిత్ షా తెలంగాణ పర్యటన అధికారిక షెడ్యూల్ ఖరారు.. నేడు హైదరాబాద్ కు కేంద్ర హోంమంత్రి రాక
వామపక్షాలతో పొత్తులపై చర్చలు చేస్తున్నాం..
వామపక్షాలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటారని రాజగోపాల్ రెడ్డి, వివేక్, విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి బీజేపీలో చేరారని వెల్లడించారు. అయితే, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నారని తెలిసి ఇప్పుడు వారు తిరిగి కాంగ్రెస్ కి వస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ లో చేరుతున్నానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు, ఎప్పుడు చేరుతారనే స్వేచ్ఛ రాజగోపాల్ రెడ్డికి ఉందన్నారు. కాంగ్రెస్ లో చేరే వారికి పార్టీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నవారు సిద్ధాంతపరంగా బీజేపీ వారు కాదని, కేసీఆర్ పై పోరాడాలని చేరారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు నిజం తెలిసి బయటకు వస్తున్నారని చెప్పారు.
ఎన్నికల నిర్వహణ టీంగా వ్యవహరిస్తున్న అధికారులు ..
అధికారులు ఎన్నికల నిర్వహణ టీం గా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంజనీ కుమార్, రిటైర్డ్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించి బదిలీ చేయాలని ఈసీని కోరామని తెలిపారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. తాము సంక్షేమ పథకాల నిధులు ఆపాలని కోరడం లేదని తెలిపారు. నోటిఫికేషన్ తేదీకి ముందే ఇప్పటికే మంజూరు అయిన నిధులు విడుదల చేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
నవంబర్ 2వ తేదీ లోపు లబ్దిదారులకు చెల్లింపులు జరగాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తీసుకుంటే రూ.10 వేల రైతు బంధు వస్తుంది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పెన్షన్ రూ.2 వేలు వస్తే తాము వచ్చాక రూ.4 వేలు ఇస్తామని చెప్పారు. కేసీఆర్ తప్పుడు ప్రచారాలు బీఆర్ఎస్ ను కాపడలేవని తెలిపారు. కేసీఆర్ ఇంగిత జ్ఞానం కోల్పోయారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘ విద్రోహక శక్తులు బాంబులు పెడితే బ్యారేజ్ పేలుతుందని, కిందికి కుంగిపోదన్నారు. నిర్మాణ నాణ్యత లోపం కారణంగా పిల్లర్లు కుంగిపోయాయని తెలిపారు.
Dasari Manohar Reddy: పెద్దపల్లి నియోజవకర్గంలో ఆ రికార్డును సాధిస్తారా?
కేసీఆర్ జైలుకు వెళ్లే సమయం వచ్చింది..
భూ సర్వే, సాయిల్ టెస్ట్ జరపకుండా పైపైన బ్యారేజ్ నిర్మించారని ఆరోపించారు. ఎల్ అండ్ టీ కంపెనీపై చర్యలు తీసుకోకుండా సంఘ విద్రోహక శక్తులు మావోయిస్టులపై నెపం వేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ జైలుకు వెళ్లే సమయం వచ్చిందన్నారు. మోదీ, కేసీఆర్ లాలూచీ ఏంటని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఎందుకు బహిరంగ పరచడం లేదని ప్రశ్నించారు.
ఈఎన్సీ మురళీధర్ రావు 12 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారని, కేసీఆర్ కి, మురళీధర్ రావుకి ఉన్న సంబంధమేంటని నిలదీశారు. దోచుకునేందుకు ఇలాంటి అధికారులను పెట్టుకున్నారని విమర్శించారు. బాధ్యులపై థర్డ్ డిగ్రీ అమలు చేస్తేనే నిజాలు బయటకు వస్తాయన్నారు. తెలంగాణ సామంతుడు ఢిల్లీ చక్రవర్తికి కప్పం కడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే కేంద్రం మేడిగడ్డ అంశాన్ని పట్టించుకోవడం లేదన్నారు.