సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాట

భూపాలపల్లి : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసేందుకు నడుంబిగించారు. త్వరిత గతిన ప్రాజెక్టులు పూర్తి చేయాలని సంకల్పించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. కాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. అనంతరం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్ పనులను పరిశీలిస్తారు. ఇవాళ రాత్రికి కరీంనగర్ లో బస చేస్తారు. రేపు పెద్దపల్లిలోని సుందిళ్ల బ్యారేజీ, సిరిపురం, గోలివాడ పంప్ హౌస్ లను పరిశీలించనున్నారు.