కేసీఆర్ మరో యాగం : దేశాభివృద్ధి కోసం

విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రను కేసీఆర్ దంపతులు కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా మరో యాగంపై వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. 

  • Published By: sreehari ,Published On : December 28, 2018 / 11:16 AM IST
కేసీఆర్ మరో యాగం : దేశాభివృద్ధి కోసం

విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రను కేసీఆర్ దంపతులు కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా మరో యాగంపై వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగానికి సిద్ధమౌతున్నారా ? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకంటే ముందుగా ఆయన ‘రాజశ్యామల యాగం’ చేసి ఎన్నికల ప్రచారంలోకి దూకిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మ్రోగించి రెండోసారి అధికారంలోకి వచ్చింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజశ్యామల యాగం జరిపించిన  విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రను కేసీఆర్ దంపతులు కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా మరో యాగంపై వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. 

కేసీఆర్ సెంటిమెంట్…
కేసీఆర్..సెంటిమెంట్‌కు అధిక ప్రాధాన్యతనిస్తారనే సంగతి తెలిసిందే. ఏ కార్యక్రమం మొదలు పెట్టినా వాస్తు..సంఖ్య శాస్త్రం…ఇతరత్రా చూసుకుని ముందుకు కదులుతుంటారు. పూజలతో పాటు యాగాలపై కూడా విశ్వాసం ఎక్కువ. గతంలో పలు యాగాలు నిర్వహించిన గులాబీ బాస్….2015లో ఆయుత చండీయాగం నిర్వహించారు కూడా. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్…జాతీయ రాజకీయాల వైపు ద‌ృష్టి సారించారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం నాన్ బీజేపీ..నాన్ కాంగ్రెస్ పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పిలుపునివ్వడమే కాదు..దేశంలోని పార్టీల నేతలను కలిసి దానిపై చర్చిస్తున్నారు కూడా. 

జనవరి 21న యాగం…
ఇదిలా ఉంటే మరోసారి యాగం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 21 నుండి ఎర్రవెల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో యాగాన్ని నిర్వహించబోతున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఏ యాగం చేయబోతున్నారు ? దాని పేరు ఏంటీ ? అనేది తెలియరావడం లేదు. మరి గులాబీ దళపతి యాగం చేస్తారా ? లేదా ? ఇతరత్రా వివరాలు కొద్ది రోజుల్లో తెలియనున్నాయి.