Telangana : తెలంగాణకు చల్లని కబురు.. రానున్న 3 రోజులు వర్షాలు

Telangana Rain Alert : ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వానలు పడతాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగుతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలియజేశారు.

Telangana : తెలంగాణకు చల్లని కబురు.. రానున్న 3 రోజులు వర్షాలు

Heavy Rains (Photo : Google)

Updated On : May 21, 2023 / 8:29 PM IST

Telangana-Rain Alert : మాడు పగిలే ఎండలతో, తీవ్రమైన ఉక్కపోతతో విలవిలలాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు వానలు పడతాయంది. తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వానలు పడతాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగుతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలియజేశారు.

Also Read..climate update: ఇవేం ఎండలు రా బాబూ.. మే నెల ముగిసినా ఎండలు తగ్గవట!

మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూల్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వానలు కురుస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. అదే సమయంలో అక్కడక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

వనపర్తి జిల్లాలో గాలివాన బీభత్సం, ఒకరు దుర్మరణం
వనపర్తి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని క్రిష్ణగిరి గ్రామంలో విద్యుత్ స్థంభాలు, చెట్లు నేలకొరిగాయి. తీవ్రమైన గాలులకు గుడిసెలు, రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయి. గాలి వాన దుమారానికి గుడిసె కూలి మహిళ మృతి చెందింది. గాలి వాన బీభత్సతానికి ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. తీవ్ర గాలులతో కూడిన వర్షం కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Andhra Pradesh : ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షం.. కడప జిల్లాలో గాలి బీభత్సానికి ఒకరు దుర్మరణం