Andhra Pradesh : ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షం.. కడప జిల్లాలో గాలి బీభత్సానికి ఒకరు దుర్మరణం

Rain : గాలి బీభత్సంతో ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న రేకుల షెడ్డు పైకప్పు గాలిలోకి ఎగిరి 33 కెవి విద్యుత్ తీగలపై పడడంతో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.

Andhra Pradesh : ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షం.. కడప జిల్లాలో గాలి బీభత్సానికి ఒకరు దుర్మరణం

Rains in Andhra Pradesh

Andhra Pradesh – Rain : ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడింది. మాడు పగిలే ఎండలతో విలవిలలాడిన ప్రజలు వర్షం కురవడంతో కాస్త రిలాక్స్ అయ్యారు. వాతావరణం చల్లబడటంతో సేదతీరారు.

కడప జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఎండ, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. పులివెందులలో భారీ వర్షం పడింది. పులివెందులలోని మెయిన్ బజార్ వద్ద కొన్ని దుకాణాల్లోకి వర్షం నీరు ప్రవహించింది. దీంతో వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. సరుకు తడిసిపోవడంతో లబోదిబోమంటున్నారు.

Also Read..climate update: ఇవేం ఎండలు రా బాబూ.. మే నెల ముగిసినా ఎండలు తగ్గవట!

కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురంలో ఈదురు గాలి బీభత్సం సృష్టించింది. గాలి బీభత్సంతో ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న రేకుల షెడ్డు పైకప్పు గాలిలోకి ఎగిరి 33 కెవి విద్యుత్ తీగలపై పడడంతో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వర్షం పడటంతో రేకుల కింద తలదాచుకున్న వ్యక్తి మీద రేకులు పడ్డాయి. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బేతాయపల్లి గ్రామానికి చెందిన చిన్న సుబ్బయ్య (55)గా గుర్తించారు.

నంద్యాల జిల్లా ఆత్మకూరులో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది.

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. పెనుకొండ మండలం గుట్టూరులో వడగండ్ల వర్షం కురిసింది. పరిగి మండలం సుబ్బరాయుని పల్లి గ్రామంలో ఈదురు గాలులకు పెద్ద వృక్షం నేలకూలి రైతు శ్రీరామప్పకు చెందిన గేదె మృతి చెందింది.

Also Read..Nellore Rural Constituency: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాఖాలో వైసీపీ తడాఖా చూపుతుందా?

ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. ద్రోణి ప్రభావంతో రేపు(మే 22) శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా జిల్లాల్లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని సూచించింది.