కరోనా లాక్ డౌన్ : 30 రోజులు..లక్షకు పైగా వాహనాలు సీజ్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఎన్నో దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. భారతదేశంలో కూడా ఈ వైరస్ ప్రతాపం చూపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించి 30 రోజులు పూర్తయ్యాయి. ఈ రోజుల్లో ప్రజలు రోడ్ల మీదకు రావొద్దని..కరోనా వైరస్ కు కట్టడికి సహకరించాలని స్వయంగా సీఎం కేసీఆర్ చేతులెత్తి దండం పెట్టారు. అటు వైద్యులు, నిపుణులు సూచిస్తున్నా కొంతయంది డోంట్ కేర్ అంటున్నారు.
యదేచ్చగా రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో పోలీసులు వీరి భరతం పడుతున్నారు. ఎలాంటి కారణం లేకుండానే రోడ్డు మీదకు వస్తున్న వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. గత నెల రోజుల వ్యవధిలో లక్షకు పైగా వాహనాలను సీజ్ చేశారు.
హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమీషనరేట్ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విభాగాల్లో మొత్తం 10 లక్షలకు పై చలాన్లు జారీ చేయడం గమనార్హం. వీటన్నింటిపై లాక్ డౌన్ పూర్తయిన తర్వాత…పోలీసులు కోర్టుల్లో ఛార్జీషీట్లను దాఖలు చేయనున్నారు. కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా…ఉల్లంఘన దారులకు ఫైన్, జైలు శిక్ష విధించనున్నారు.
మార్చి 22 – ఏప్రిల్ 22 కేసుల వివరాలు :
చలాన్లు : హైదరాబాద్ (4, 16, 000), సైబరాబాద్ (5, 05, 459). రాచకొండ (85, 000).
బండ్ల సీజ్ : హైదరాబాద్ (76, 259). సైబరాబాద్ (13, 000). రాచకొండ (12, 000).