Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్

ఇటీవల తనని కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తాను హోంఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు.

Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్

Kishan

Updated On : January 20, 2022 / 2:50 PM IST

Corona for Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. కోవిడ్ టెస్టులు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలున్నట్లు వెల్లడించారు. ఇటీవల తనని కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు.

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత రెండు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కనిపించినప్పటికీ.. జనవరి 19, 2022 నాడు భారీగా పెరిగాయి.

Corona Control : తెలంగాణలో కరోనా కట్టడికి కొత్త వ్యూహాలు.. లక్షణాలున్న ప్రతి ఒక్కరికి కోవిడ్ కిట్ పంపిణీ

థర్డ్ వేవ్ మొదలైనప్పటినుంచి మొదటిసారి దేశంలో రోజు వారీ పాజిటివ్ కేసుల సంఖ్య 3లక్షలు దాటింది. దేశంలో 24గంటల్లో 3,17,532 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 491 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ లో తెలిపింది.

దేశంలో జనవరి 19 నాటికి 19,24,051 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల శాతం 5.03గా ఉందని కేంద్రం తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతానికి చేరింది. దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 82 లక్షల 18వేల 773 కేసులు నమోదయ్యాయి. 4లక్షల 87వేల 693 కరోనా మరణాలు సంభవించాయి.