Nizamabad GGH : ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకు వైద్యసేవలు

ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని సదుపాయాలు, ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. కోవిడ్ తో ఇబ్బంది పడుతూ విషమ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లినా, ఆరోగ్యంతో బయటకు వస్తామనే నమ్మకాన్ని కల్పిస్తున్నారు వైద్యులు, సిబ్బంది.

Nizamabad GGH : ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకు వైద్యసేవలు

Nizamabad Govt Hospital

Updated On : May 18, 2021 / 7:49 PM IST

Nizamabad Govt General Hospital : ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని సదుపాయాలు, ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. కోవిడ్ తో ఇబ్బంది పడుతూ విషమ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లినా, ఆరోగ్యంతో బయటకు వస్తామనే నమ్మకాన్ని కల్పిస్తున్నారు వైద్యులు, సిబ్బంది.

అన్ని అధునాతన సౌకర్యాలతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇప్పుడు కోవిడ్ బాధితులకు వైద్యం అందిస్తూ భరోసానిస్తోంది. ఆసుపత్రిలో ప్రత్యేకంగా కోవిడ్ వార్డులను ఏర్పాటు చేశారు. సుమారు 534 బెడ్లను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. జిల్లా నుంచే కాకుండా కామారెడ్డి, నిర్మల్ తో పాటు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి కరోనా చికిత్స కోసం వస్తున్నారు.