CPI Leader Narayana Comments : తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు బీజేపీకి లేదు : సీపీఐ నేత నారాయణ

బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు బీజేపీకి లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన బీజేపీ నేతల పేర్లు చెప్పగలరా అని అడిగారు. తెలంగాణ పోరాట యోధులను బీజేపీ హైజాక్ చేస్తోందన్నారు. 12 మందిని చంపిన అమిత్ షా నిర్దోషిగా తిరుతుతున్నారని పేర్కొన్నారు.

CPI Leader Narayana Comments : తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు బీజేపీకి లేదు : సీపీఐ నేత నారాయణ

CPI Leader Narayana Comments

Updated On : September 17, 2022 / 3:44 PM IST

CPI Leader Narayana Comments : బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు బీజేపీకి లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన బీజేపీ నేతల పేర్లు చెప్పగలరా అని అడిగారు. తెలంగాణ పోరాట యోధులను బీజేపీ హైజాక్ చేస్తోందన్నారు. 12 మందిని చంపిన అమిత్ షా నిర్దోషిగా తిరుతుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి అమిత్ షా మాట్లాడుతున్నారని.. ఏ ఉద్యమంలో బీజేపీ పాత్ర ఉందని ప్రశ్నించారు.

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏంటని నిలదీశారు. సెప్టెంబర్ 17ను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ నేతలు బ్రిటీషర్ల బూట్లు నాకారని ఘటు విమర్శలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం తమ వారసత్వ హక్కుగా తాము చెప్పలగమన్నారు. చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధులను ఐజాక్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Telangana Movement 1948 : తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వ హక్కు.. దానికి గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికి లేదు : CPI నారాయణ

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు మీకుందా అని ప్రశ్నించారు. దేశంలో లౌకిక వ్యవస్థను నాశనం చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వల్ల దేశానికి నష్టమని.. అన్ని శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ వ్యతిరేక కూటమిలోకి రాకపోతే పార్టీలు దేశ ద్రోహులుగా మిగిలిపోతాయని పేర్కొన్నారు.