లోక్‌సభ ఎన్నికలు.. కాంగ్రెస్‌తో పొత్తుపై నారాయణ కీలక వ్యాఖ్యలు

కమ్యూనిస్టులతో కలిసి ఉంటేనే కాంగ్రెస్ కు ఫలితం భాగుంటుంది. ఎలాగూ కలిసి ఉన్నామని లైట్ తీసుకోవద్దు. మేమూ రాష్ట్రంలో బలంగా ఉన్నాం.

లోక్‌సభ ఎన్నికలు.. కాంగ్రెస్‌తో పొత్తుపై నారాయణ కీలక వ్యాఖ్యలు

CPI Narayana

CPI Narayana : తెలంగాణలో సీపీఐకి ఒక్క లోక్ సభ సీటు అయినా కాంగ్రెస్ ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు కుదరదని ఆయన తేల్చి చెప్పారు. తాము కాంగ్రెస్ కు 5 స్థానాలు సూచించామని, అందులో ఏదో ఒకటి ఇవ్వాలని నారాయణ చెప్పారు. అన్నదాతలు న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తుంటే బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారని నారాయణ వాపోయారు. ఆందోళనలో యువ రైతు మరణం.. మోదీ, కేంద్ర సర్కారు హత్యగా ఆయన అభివర్ణించారు. హైదరాబాద్ లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నారాయణ పాల్గొన్నారు.

‘బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టిన ఆర్థిక నేరస్తులు హాయిగా విదేశాల్లో ఉన్నారు. అన్నం పెట్టే రైతన్నలు మాత్రం రోడ్ల మీద ఉన్నారు. మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పి రైతుల డిమాండ్లు నెరవేర్చాలి. మోదీ అందాల పోటీలో పాల్గొంటే నెంబర్ వన్ గా వస్తారు. కానీ ప్రధానిగా కాదు. దేశంలో ఫస్ట్ టైం.. ఒక క్రిమినల్.. హోం మంత్రిగా ఉన్నారు. ప్రధాని మోడీకి ఒకవైపు జగన్ మరోవైపు చంద్రబాబు పూజ చేస్తున్నారు” అని నారాయణ అన్నారు.

కూనంనేని సాంబశివరావు, సీపీఐ ఎమ్మెల్యే
కమ్యూనిస్టులతో కలిసి ఉంటేనే కాంగ్రెస్ కు ఫలితం భాగుంటుంది. ఐదు స్థానాల్లో ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, నల్గొండ, భువనగిరి సీట్లలో ఏదో ఒకటి అడుగుతున్నాం. ఐదు స్థానాల్లో ఏదైనా ఒకటి ఇస్తే బాగుంటుంది. ఎలాగూ కలిసి ఉన్నామని లైట్ తీసుకోవద్దు. మేమూ రాష్ట్రంలో బలంగా ఉన్నాం. ఐదు పార్లమెంట్ స్థానాల్లో వరుసగా మా బలప్రదర్శన ర్యాలీలు చేపడతాం.

Also Read : నీటి పోరు యాత్ర.. మరో ఉద్యమానికి సిద్ధమైన బీఆర్‌ఎస్‌!