CPI Narayana: పల్లవి ప్రశాంత్‌ బలవన్మరణానికి పాల్పడితే వారే బాధ్యులు: సీపీఐ నారాయణ

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ను కేసులతో వేధించడం సరికాదన్నారు సీపీఐ నారాయణ.

CPI Narayana: పల్లవి ప్రశాంత్‌ బలవన్మరణానికి పాల్పడితే వారే బాధ్యులు: సీపీఐ నారాయణ

Pallavi Prashanth, CPI Narayana

Updated On : December 20, 2023 / 7:17 PM IST

Pallavi Prashanth: బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ పోలీస్ కేసుల వల్ల బలవన్మరణానికి పాల్పడితే దానికి పోలీసులే బాధ్యులని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. నారాయణ మొదటి నుంచి బిగ్‌బాస్ షోను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఆయన ఓ వీడియో రూపంలో మాట్లాడుతూ.. పల్లవి ప్రశాంత్‌ బలవ్మరణానికి పాల్పడతాడేమోనని అన్నారు.

బిగ్‌బాస్-7 ముగిసిన తర్వాత జరిగిన గొడవలకు కేవలం ప్రశాంత్‌ మీదే కేసులు నమోదు చేయడం ఏంటని, ఆ షో మేనేజ్‌మెంట్‌, వ్యాఖ్యాత నాగార్జున మీద కూడా కేసులు పెట్టాలని నారాయణ డిమాండ్ చేశారు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ను కేసులతో వేధించడం సరికాదన్నారు.

అతడు బలవన్మరణానికి పాల్పడితే బాధ్యత ఎవరిదని నారాయణ నిలదీశారు. పల్లవి ప్రశాంత్ పై పెట్టిన కేసులను కొట్టేయాలన్నారు. పల్లవి ప్రశాంత్‌ ఎక్కడున్నా సీపీఐ కార్యాలయానికి రావాలని, తాము అతడికి రక్షణ కల్పిస్తామని చెప్పారు. కాగా, పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. కొందరు తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారంటూ పల్లవి ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Bigg Boss Fans Ruckus : బిగ్‌బాస్ ఫ్యాన్స్ విధ్వంసం కేసు.. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు