Bathukamma Sarees Distribution : కోటి బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధం..30 రకాల రంగులు, 240 డిజైన్లతో శారీస్

బతుకమ్మ పండగకు మహిళలకు పంపిణీ చేసే చీరలు సిద్ధమవుతున్నాయి. ఎప్పటిలానే ఈయేడు కూడా బతుకమ్మ చీరలు భారీగా పంపిణీ చేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది 340 కోట్ల రూపాయల వ్యయంతో బతుకమ్మ చీరలు నేయిస్తున్నారు.

Bathukamma Sarees Distribution : కోటి బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధం..30 రకాల రంగులు, 240 డిజైన్లతో శారీస్

Bathukamma Sarees Distribution

Updated On : September 11, 2022 / 8:43 PM IST

Bathukamma Sarees Distribution : బతుకమ్మ పండగకు మహిళలకు పంపిణీ చేసే చీరలు సిద్ధమవుతున్నాయి. ఎప్పటిలానే ఈయేడు కూడా బతుకమ్మ చీరలు భారీగా పంపిణీ చేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది 340 కోట్ల రూపాయల వ్యయంతో బతుకమ్మ చీరలు నేయిస్తున్నారు. 240 పై చిలుకు వెరైటీ డిజైనర్లతో చీరలు తయారుచేసి పంపిణీకి సిద్ధం చేశారు.

సిరిసిల్లలోని మరమగ్గాలపై నేసిన పది లక్షల చీరలను చౌటుప్పల్‌లోని ఓ మిల్లులో శుద్ధి చేసి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు వెండి, బంగారు, జరీ అంచులతో తయారు చేయించారు. ఒక కోటి 18 లక్షల చీరలు టెస్కో ద్వారా మహిళలకు పంపిణీ చేయనున్నారు.

Batukamma Exhibition : దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన.. అతిపెద్ద స్ర్కీన్ ఇదే!

తెలంగాణ ప్రాంతంలో జరిగే బతుకమ్మ పండుగ ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నారు సీఎం కేసీఆర్. రంగు రంగుల వన్నెల్లో, కలర్ ఫుల్ రంగులతో చీరలను సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో నేయిస్తున్నారు. త్వరలోనే చీరలను పంపిణీ చేయనున్నారు.