డబ్బులు కావాలంటూ కలెక్టర్ నుంచి మెసేజ్ లు…అసలేం జరిగిందంటే…

  • Published By: murthy ,Published On : November 5, 2020 / 04:37 PM IST
డబ్బులు కావాలంటూ కలెక్టర్ నుంచి మెసేజ్ లు…అసలేం జరిగిందంటే…

Updated On : November 5, 2020 / 5:07 PM IST

fake Face Book account : సోషల్ మీడియాను కేటుగాళ్లు తెగ వాడేస్తుంటారు. ఇనస్టా గ్రాంలో ఫోటోలు, ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాలు….. డేటింగ్ యాప్ లు …. ఇలా అవకాశం ఉన్నంత వరకు సోషల్ మీడియా ద్వారా ప్రజలను బురిడీ కొట్టిస్తూనే ఉంటారు.

తాజాగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పేరుతో మోసగాళ్ళు ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా తెరిచారు. ఆ ఖాతా ద్వారా ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయటానికి ప్రయత్నించారు. తన బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని… అర్జంట్ గా డబ్బులు కావాలంటూ ఆయన పేరుతో పలువురికి మెసేజ్ లు పంపించారు.



విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే అలర్ట్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఒరిజినల్ ఫేస్ బుక్ స్నేహితులందరినీ అప్రమత్తం చేశారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వోద్దని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.