ఇలా కాకూడదంటే.. జాగ్రత్తగా ఉండండి.. వీడియో షేర్ చేసిన పోలీసులు

వాహన చోదకులు చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పెద్ద ప్రమాదాలను తప్పించుకోవచ్చు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేసిన ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతోంది.

ఇలా కాకూడదంటే.. జాగ్రత్తగా ఉండండి.. వీడియో షేర్ చేసిన పోలీసులు

Cyberabad Traffic Police shared video women safety while bike ride

Updated On : January 2, 2024 / 4:44 PM IST

women safety while bike ride: పదే పదే చెప్పేదే.. అయినా మనలో చాలా మంది పట్టించుకోరు. ఎన్నిసార్లు జాగ్రత్తలు చెప్పినా పెడచెవినా పెడుతుంటారు.. ఫలితంగా ప్రమాదాలు కొనితెచ్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వాహన చోదకులు ప్రయాణాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రమాదాలను కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తప్పించుకోవచ్చు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలిపే వీడియో ఒకటి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ (ట్విటర్)లో తాజాగా షేర్ చేశారు.

ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో వివరించారు. బైకులపై వెనుకవైపున కూర్చునే మహిళల దుస్తులు ఒక్కోసారి చక్రాల్లో ఇరుక్కుని ప్రమాదాల బారిన పడుతున్నారు. బైక్ వెనుక సీటుపై కూర్చున్న మహిళ దుస్తులు చక్రంలో ఇరుక్కోవడంతో ఓ కుటుంబం ప్రమాదం బారిన పడిన విజువల్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మహిళా ట్రాఫిక్ పోలీసుతో చెప్పించారు.

Also Read: అల‌ర్ట్‌.. పెండింగ్ చ‌లాన్లు చెల్లిస్తున్నారా..? ఈ విష‌యం తెలుసుకోండి

బైకులపై వెనుకవైపున కూర్చునే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని.. దుస్తులను చక్రాల దగ్గరకు వెళ్లకుండా ప్రాపర్ గా పోల్డ్ చేసుకోవాలని కోరారు. చున్నీలు, చీర కొంగులను వీల్స్ కు దూరంగా ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు. వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.