D Srinivas: డి.శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమం: వైద్యులు

ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నిన్నటితో పోల్చితే మాత్రం..

D Srinivas: డి.శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమం: వైద్యులు

D Srinivas

Updated On : September 12, 2023 / 5:15 PM IST

D Srinivas – Congress: మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని హైదరాబాద్ లోని సిటీ న్యూరో వైద్యుడు ప్రవీణ్ తెలిపారు. డి.శ్రీనివాస్ కొంతకాలంగా కిడ్నీ తదితర సమస్యలతో బాధపడుతున్నారు. యూరిన్ ఇన్ఫెక్షన్‌కు గురికావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆయనను సోమవారం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. దీనిపై ప్రవీణ్ మాట్లాడుతూ.. డి.శ్రీనివాస్ శ్వాస తీస్కోవడంలో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నిన్నటితో పోల్చితే మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగు పడిందని తెలిపారు.

అయితే 48 గంటలు గడిస్తే కానీ హెల్త్ కండిషన్ గురించి చెప్పలేమని అన్నారు. ఆస్తమా, కిడ్నీ సమస్య, బీపీ పడిపోవడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వయసు రీత్యా ఆరోగ్య ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.

KTR: తెలంగాణ ఎన్నికలపై కేటీఆర్ సంచలన కామెంట్స్