సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక, ఒక్కొక్కరికి రూ.60వేల 468 బోనస్

  • Published By: naveen ,Published On : October 13, 2020 / 04:25 PM IST
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక, ఒక్కొక్కరికి రూ.60వేల 468 బోనస్

Updated On : October 13, 2020 / 5:04 PM IST

singareni workers: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. అక్టోబర్ 23న సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ ఇవ్వనున్నారు. ఒక్కొక్కరికి రూ.60వేల 468 బోనస్ లభించే అవకాశం ఉంది. దసరా పండగ అడ్వాన్స్ గా అక్టోబర్ 19న ఉద్యోగుల ఖాతాల్లో రూ.25వేలు వేయనున్నారు. మార్చి నెలలో మినహాయించిన జీతం కూడా చెల్లించనున్నారని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు.




2019-20 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన లాభాల నుంచి 28 శాతం వాటా చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గ‌త ఏడాది ద‌స‌రా కానుక‌గా అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న చేసిన సీఎం.. ఈ మేర‌కు కార్మికుల‌కు 28 శాతం వాటా చెల్లించాలని అధికారుల‌ను ఆదేశించారు.