Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ!

ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసుపై ఏప్రిల్ 8న తీర్పును వెలువరించనుంది. సోమవారం ఉదయం 10:30గంటలకు సీబీఐ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి భవేజా తీర్పు వెలువరించనున్నారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ!

Delhi Liquor Scam _ Court verdict tomorrow on Kavita's bail petition

Updated On : April 7, 2024 / 10:50 PM IST

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ నెలకొంది. రేపు (ఏప్రిల్ 8న ) ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసుపై తీర్పును వెలువరించనుంది. సోమవారం ఉదయం 10:30గంటలకు సీబీఐ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి భవేజా తీర్పు వెలువరించనున్నారు. ఇప్పటికే, ఏప్రిల్ 4న కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.

Read Also : Congress: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్‌ నేతలు.. వరుసగా ఏం జరిగిందో తెలుసా?

పీఎంఎల్ఏ సెక్షన్ 45, మహిళగా, ఎమ్మెల్సీగా ఉన్నందున, ముఖ్యంగా తన చిన్న కుమారుడుకి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత బెయిల్ పిటిషన్‌లో కోరారు. కానీ, కవిత‌కు మధ్యంతర బెయిల్‌‌ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకిస్తోంది.

ఒకవేళ.. కవితకు బెయిల్ ఇస్తే.. లిక్కర్ కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, సాక్షులను ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని, ఇప్పటికే అప్రూవల్‌గా మారిన కొందరిని కవిత బెదిరించారని, అందుకు ఆధారాలు ఉన్నాయని కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని ఈడీ కోర్టును కోరింది.

అయితే, ఢిల్లీ లిక్కర్ పాలసీ మనిలాండరింగ్ కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాగా.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఏప్రిల్ 9తో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 20న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరుపనుంది. లిక్కర్ కేసులో కవితకు మధ్యంతర బెయిల్‌పై తీర్పు ఎలా ఉండబోతుందని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Read Also : మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో 10టీవీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ