Drugs Seized: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.20 కోట్లు విలువైన హెరాయిన్ పట్టివేత

కాగా కొద్దీ రోజుల క్రితం ఇదే ఎయిర్‌పోర్టులో రూ.78 కోట్ల విలువచేసే 12 కిలోల హెరాయిన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యుగాండా, జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికుల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

Drugs Seized: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.20 కోట్లు విలువైన హెరాయిన్ పట్టివేత

Drugs Seized

Updated On : June 21, 2021 / 10:13 AM IST

Drugs Seized: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ ప్రయాణికుడు రూ.20 కోట్ల విలువచేసే హెరాయిన్ ను తీసుకొస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు పట్టుకున్నారు.

టాంజానియా దేశానికి చెందిన జాన్ విలియమ్స్ అనే వ్యక్తి నుంచి 3 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. డ్రగ్స్ ఎక్కడి తీసుకొస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.