MLA Raghunandan Rao : కారుకు పంచర్ వేసి పంపించా .. నాతో పెట్టుకోవద్దు : ఎమ్మెల్యే రఘునందన్ రావు

దుబ్బాక నుండి ముస్తాబాద్, మెదక్ నుంచి చేగుంట వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయిస్తే శంకుస్థాపన చేసింది నువ్వు కాదా హరీష్? దౌల్తాబాద్ నుండి చేగుంట రోడ్డుకు సెంట్రల్ ఫండ్ తెచ్చింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు.

MLA Raghunandan Rao : కారుకు పంచర్ వేసి పంపించా .. నాతో పెట్టుకోవద్దు : ఎమ్మెల్యే రఘునందన్ రావు

MLA Raghunandan Rao

Updated On : October 3, 2023 / 2:40 PM IST

MLA Raghunandan Rao..harish rao : మంత్రి హరీష్ రావుపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతు రఘునందన్ రావు మాట్లాడుతు.. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇచ్చినట్లు మళ్లీ ప్రొసీడింగ్స్ కాగితాలకే పరిమితం తప్ప చేసింది ఒక్క పని ఉండదుని విమర్శించారు. దుబ్బాక నుండి ముస్తాబాద్, మెదక్ నుంచి చేగుంట వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయిస్తే శంకుస్థాపన చేసింది నువ్వు కాదా హరీష్? అంటూ ప్రశ్నించారు. దౌల్తాబాద్ నుండి చేగుంట రోడ్డుకు సెంట్రల్ ఫండ్ తెచ్చింది నిజం కాదా? అన్నారు.

డబ్బులులేవని సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇవ్వకుండా పైసలు ఉన్నోల్లకు అమ్ముకున్నావు అంటూ ఆరోపించారు. అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా హరీష్ రావు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అంటూ సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో కారుకు పంక్చర్ చేసి పంపించా..అటువంటి నాతో పెట్టుకోవద్దు అంటూ ఎద్దేవా చేశారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తామని ప్రమాణం చేసే మీరు మిమ్మల్ని గెలిపిస్తేనే అభివృద్ధి చేస్తామనడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు.

ECI : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ తుది కసరత్తు.. హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర ఎన్నికల బృందం

దుబ్బాక ప్రజల ఆత్మగౌరవం దెబ్బగొట్టె ప్రయత్నం హరీష్ రావు చేస్తున్నారు అది సరైనది కాదు అంటూ విమర్శించారు. సిద్దిపేటకు రైలు వచ్చింది అది ప్రధాని నరేంద్ర మోదీ ఘనత కాదంటారా? అంటూ ప్రశ్నించారు. హబ్సీపూర్ నుంచి దుబ్బాకకు ఫోర్ లైన్ మంజూరైందని గతంలో రామలింగన్న ప్రకటిస్తే అది ఇంతవరకు కాకుండా ఆపింది నువ్వు కాదా..? అంటూ దుయ్యబట్టారు. రఘునందన్ రావు కు పేరొస్తదనే కుట్రతో ఆపేశారని ఇటువంటివి సరైనవి కాదని మండిపడ్డారు. మీకు చాతనైతే ఫోర్ వే కు నిధులు మంజూరు చేయి.. అంటూ సవాల్ విసిరారు. గజ్వేల్ నియోజకవర్గంకు రైలు ఇచ్చింది మోదీ ప్రభుత్వం అని.. దుబ్బాకలో ఏది పడితే అది మాట్లాడితే నీకు దుబ్బాక ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

Minister KTR : గుజరాత్‌ని గుండెల్లో పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా ? ప్రధాని మోదీపై కేటీఆర్ విమర్శలు

నీ కోమటి చెరువుకు ఖర్చు చేసిన డబ్బులు దుబ్బాక నియోజక వర్గానికి ఇవ్వలేదని ఆరోపించారు. గతంలో ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు తగిన బుద్ధి చెప్పారు అది గుర్తుంచుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే జరిగుతుంది అంటూ ధీమా వ్యక్తంచేశారు. మీ తాటాకు చప్పుళ్లకు ఉడుత చూపులకు భయపడేది అంటూ రఘునందన్ రావు కాదని తెలుసుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు. గతంలో జర్నలిస్టులకు 25 లక్షల ప్రొసీడింగ్ ఇచ్చి ఇంతవరకు మొదలు లేదు మోక్షం లేదు అంటూ విమర్శలు సంధించారు.