Eatala Rajender: ఈ రెండు పార్టీలు డ్రామా కంపెనీలు: ఈటల రాజేందర్

తెలంగాణ గడ్డమీద ఎగరాల్సిన జెండా బీజేపీదని ప్రజల మనసులలో ఉందని చెప్పారు.

Eatala Rajender: ఈ రెండు పార్టీలు డ్రామా కంపెనీలు: ఈటల రాజేందర్

Eatala Rajender

Updated On : December 6, 2024 / 3:46 PM IST

హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారు. సభాస్థలి ఏర్పాట్లను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు బీజేపీ నేతలు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డ్రామా కంపెనీలని చెప్పారు. ఆ రెండు పార్టీలు ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చూసిన ప్రజలు హరియాణా, మహారాష్ట్రలో తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు.

శాంతి నెలకొల్పాలంటే బీజేపీతోనే సాధ్యమని హరియాణా ప్రజలు నమ్మారని ఈటల రాజేందర్ తెలిపారు. చేవలేని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడిస్తే సిగ్గు లేకుండా ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మహారాష్ట్రలో ప్రజలు బీజేపీని గెలిపించుకోవానే ఉద్దేశంతో గెలిపించారని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి చెప్పారని అన్నారు.

మోదీ ఎదుగుదలను అడ్డుకోవాలని, దేశం ప్రతిష్ఠను దిగజార్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ గడ్డమీద ఎగరాల్సిన జెండా బీజేపీదని ప్రజల మనసులలో ఉందని చెప్పారు. ఇది ఇంటెలిజెన్స్ చేసిన సర్వేలో బయటపడిందని చెప్పుకొచ్చారు. అందరం కలిసి పనిచేసుకుందామని, నిబద్ధతతో పనిచేసి బీజేపీని గెలిపించుకుందామని తెలిపారు. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ హామీని కూడా నెరవేర్చడం లేదని అన్నారు.

కాంగ్రెస్ విధానాల వైఫల్యం వల్లే ప్రపంచంలో భారత్‌కు ఈ పరిస్థితి: కేఏ పాల్