బీజేపీలో చేరకముందే నేను ప్రధాని మోదీని రెండుసార్లు కలిశాను: ఈటల రాజేందర్  

"పదవులు శాశ్వతం కాదు.. మానవ సంబంధాలు శాశ్వతం" అని తెలిపారు.

బీజేపీలో చేరకముందే నేను ప్రధాని మోదీని రెండుసార్లు కలిశాను: ఈటల రాజేందర్  

Eatala Rajender

Updated On : June 22, 2025 / 4:01 PM IST

బీజేపీలో తాను చేరకముందు ప్రధాని మోదీని రెండు సార్లు కలిశానని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మోదీ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి మోదీ అని తాను బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడే చెప్పానని తెలిపారు. ఇవాళ సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో “వికసిత భారత్ అమృత కాలం.. సంకల్ప సభ”ను నిర్వహించారు.

ఇందులో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… “జీఎస్టీ స్టడీ కౌన్సిల్ సభ్యుడిగా దేశం అంతా తిరిగాం. ఆస్ట్రేలియాలో జీఎస్టీ అమలు చేసి తమ దేశంలో ప్రభుత్వం ఓడిపోయిందని అక్కడి వారు అన్నారు. భారత్‌లో జీఎస్టీ సమర్థంగా అమలు అవుతోంది. మోదీ కేవలం చేతులు ఊపి ప్రధాని కాలేదు… చెమటోడ్చి కష్టపడి పని చేసి మూడోసారి ప్రధాని అయ్యారు. కరోనాతో ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలు విలవిలలాడాయి.

కనీస మౌలిక సదుపాయాలు లేకుండా పోయాయని దేశాధినేతలు ఏడ్చారు. భారతదేశంలో కరోనా వస్తే దేశం శవాల గుట్టగా మారుతుందని కొందరు బెదిరించారు. ప్రధానిగా ఉన్న మోదీ భయపడకుండా ప్రజలకు ధైర్యం చెప్పారు. ఉచితంగా 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యం ఇచ్చారు. దేశ ట్రెజరీ నుంచి కంపెనీలకు డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలని ఆదేశించారు.

Also Read: ఈ కంపెనీ ఏడాదికి ఒక్కో ఉద్యోగిపై రూ.21 కోట్లు సంపాదిస్తుంది తెలుసా? ఏ కంపెనీ ఎంతో ఫుల్ లిస్ట్..

మన దేశం ప్రజలు విదేశాలలో ఊడిగం చేస్తున్నారు. ఆ మేధో శక్తి దేశంకోసం ఉపయోగపడాలని ఆలోచించి మేకిన్ ఇండియా స్కీం తీసుకుని వచ్చారు. 14 ఏళ్లు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. చెమటలు కక్కుతూ రాష్ట్రం కోసం కొట్లాడి సాధించాం. తెలంగాణ ఉత్తగా రాలేదు. రేవంత్ వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది.

బీజేపీ ప్రాజెక్టులకు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఏ పార్టీ అధికారంలో ఉందో అవసరం లేదు అన్ని రాష్ట్రాల అభివృద్ధి నాకు ముఖ్యం అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ 25 ఏళ్ల క్రితం మూతపడింది. ఎరువులు, విత్తనాలు దొరక్క ఇబ్బందులు పడ్డారు రైతులు. ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేసి రైతుల ఇబ్బందులు తొలగించిన గొప్ప వ్యక్తి మోదీ.

తెలంగాణను అందుకున్నది ప్రధాని మోదీ. కాజీపేట రైల్వే కొచ్ ఫ్యాక్టరీ కల నిజం అవుతుంది. నాయకుడు ఉంటే ఎలా ఎదుగుతారనేదానికి మోదీ నిదర్శనం. జనధన్ అకౌంట్ ఓపెన్ చేస్తే కూడా నవ్వారు. డిజిటల్ ట్రాన్సాక్షన్‌ లో భారతదేశం నంబర్ వన్ ఇప్పుడు. మోదీ హయాంలో భారతదేశం విశ్వగురు స్థానానికి ఎదుగుతోంది.

కేవలం అయోధ్యలో కాదు అరబ్ దేశాల్లో ఆలయాన్ని కట్టించిన ఘనత మోదీది. ప్రపంచ దేశాలలో కూడా భారతదేశంపై కుట్ర లు చేశారు. మోదీ మాటలు కాదు ప్రజలకు చేతులు కావాలి అని అంటారు. దేశంలో ఇప్పుడు ఎక్కడా వేర్పాటు ఉద్యమాలు లేవు. రాజకీయాలే ఎజెండాగా బతికే చిల్లరగాళ్లు కొందరు రెచ్చగొడితే రెచ్చగొడతారు. పదవులు శాశ్వతం కాదు.. మానవ సంబంధాలు శాశ్వతం” అని తెలిపారు.