రచ్చకెక్కి రాద్దాంతం చేస్తున్న ఈటల, బండి కోల్డ్‌వార్‌.. ఇలా బ్యాలెన్స్‌ చేస్తే సమస్య సాల్వ్ అవుతుందా.?

ఒకవేళ ఈటల కోరుకున్నట్లు జాతీయ స్థాయిలో పార్టీ కీలక పదవి ఇవ్వాలనుకుంటే మాత్రం..బండిసంజయ్‌ దగ్గరున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఈటల రాజేందర్‌కు ఇవ్వొచ్చన్న టాక్ వినిపిస్తోంది.

రచ్చకెక్కి రాద్దాంతం చేస్తున్న ఈటల, బండి కోల్డ్‌వార్‌.. ఇలా బ్యాలెన్స్‌ చేస్తే సమస్య సాల్వ్ అవుతుందా.?

Etela Rajender and Bandi Sanjay Kumar

Updated On : July 21, 2025 / 9:04 PM IST

ఆయనొకటి తలిస్తే మరొకటి జరుగుతుంది. ఏ ముహూర్తాన ఆయన బీజేపీ గూటికి చేరారో కానీ..ఆశించిన ఏ పదవి దక్కట్లేదట. పార్టీలో చేరిన ఏడాదికే రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించారు ఈటల. కానీ అప్పుడు అధ్యక్ష పదవి కాకుండా ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఇచ్చి..తాత్కాలికంగా సంతృప్తి పరిచారట. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రమంత్రి అవుతానని ఆశించారట. అదీ సాధ్యం కాకపోవడంతో మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో కొనసాగారు. ఆల్‌మోస్ట్ ఆయనే ప్రెసిడెంట్..ప్రకటనే ఆలస్యమన్న టాక్ నడిచింది.

కానీ లాస్ట్ మూమెంట్‌లో ఈటలకు నిరాశే తప్పింది. దీంతో తమ నేత అసంతృప్తితో ఉన్నట్లు ఈటల సన్నిహితులు చర్చించుకుంటున్నారు. దీనికి తోడు ఆయన సన్నిహితులు బండి సంజయ్‌తో కంపారిజన్ చేస్తున్నారట. ఈటలకు కేంద్రమంత్రి వస్తుందనుకుంటే బండి సంజయ్‌కి రావడం ఒకటైతే..రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలకు దక్కకుండా బండి సంజయ్ అడ్డుకున్నారని గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఈటలపై బండి పైచేయి సాధిస్తున్నారనే టాక్ కూడా ఈటలకు మింగుడు పడటం లేదట.

Also Read: చంద్రబాబుతోనే శభాష్‌ అనిపించుకుంటున్న కోటంరెడ్డి.. మంత్రిపదవి రేసులో పేరు.. విస్తరణలో అవకాశం? కానీ..

అయితే హుజురాబాద్, గజ్వేల్‌లో ఈటల ఓడిపోవడం మల్కాజ్‌గిరిలో పోటీ చేసి గెలవడంతో..ఆయన ఆ నియోజకవర్గంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సేమ్‌టైమ్‌ బండిసంజయ్‌ కరీంనగర్‌ ఎంపీగా ఉన్నారు. తన పార్లమెంట్ పరిధిలోని హుజురాబాద్‌పై బండి ప్రత్యేక దృష్టి పెట్టారట. ఒకప్పటి తన సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లో పట్టుకోసం బండి సంజయ్ ప్రయత్నం చేయడం ఈటలకు కోపం తెప్పించిందట. తనకే కాకుండా తన వర్గం నేతలకు కూడా పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని బరస్ట్ అయిపోయారు ఈటల.

అధిష్టానం ముందు ఈ ప్రతిపాదన పెట్టే యోచన?
అయితే పార్టీలో తనను అవమానాలకు గురి చేస్తున్నవారికి, పార్టీ అధిష్టానానికి తన స్థాయిని గుర్తు చేసేలా..ఈటల మాట్లాడారన్న టాక్ వినిపిస్తోంది. బండి సంజయ్‌తో ఆయన పోటీ పడేలా పార్టీలో పవర్ బ్యాలెన్స్ చేయాలని అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టే యోచనలో ఉన్నారట. కేంద్రమంత్రివర్గ విస్తరణ జరిగితే..అమాత్య యోగం కానీ..లేకపోతే జాతీయ స్థాయిలో పార్టీ పదవి అయినా కట్టబెట్టాలని అడుగుతున్నారట. జాతీయ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పవర్ బ్యాలెన్స్ చేయాలని కోరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే కిషన్‌రెడ్డి, బండిసంజయ్ ఇద్దరు సెంట్రల్ క్యాబినెట్‌లో ఉన్నారు. ఈ ఈక్వేషన్స్‌ను బట్టి చూస్తే తెలంగాణకు మూడో మంత్రి పదవి ఇస్తారా అన్నది డౌటే అంటున్నారు. లేకపోతే ఆ ఇద్దరిలో ఒకరిని తప్పించాలి. అది కూడా అయ్యే పని కాదంటున్నారు. ఇక జాతీయ పార్టీలో ఈటల కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. ఎంపీ డీకే అరుణ జాతీయ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. బండిసంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించిన తర్వాత ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు.

ఆ తర్వాత కేంద్రమంత్రి అయినా కూడా బండి పార్టీ పరంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్‌లో కొనసాగుతున్నారు. అయితే ఒకవేళ ఈటల కోరుకున్నట్లు జాతీయ స్థాయిలో పార్టీ కీలక పదవి ఇవ్వాలనుకుంటే మాత్రం..బండిసంజయ్‌ దగ్గరున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఈటల రాజేందర్‌కు ఇవ్వొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఈటలకు నేషనల్‌ పార్టీలో మంచి బెర్త్ ఇచ్చి బండి, ఈటల మధ్య పవర్ బ్యాలెన్స్ చేసి సయోధ్య కుదుర్చే అవకాశం ఉందని బీజేపీ ఆఫీస్‌లో గుసగులు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి పంచాయితీని బీజేపీ అధిష్టానం ఎలా తెంచబోతుందో..ఈటల కోరుకున్నట్లు పవర్ బ్యాలెన్స్ చేస్తారో లేదో చూడాలి మరి.