KTR : ఫార్ములా ఈ కార్ రేస్ ఎసిపోడ్ లో కీలక పరిణామం.. కేటీఆర్ పై మరో కేసు..

విదేశాలకు డబ్బు లావాదేవీలపై విచారణ జరపనుంది.

KTR : ఫార్ములా ఈ కార్ రేస్ ఎసిపోడ్ లో కీలక పరిణామం.. కేటీఆర్ పై మరో కేసు..

KTR

Updated On : December 20, 2024 / 9:27 PM IST

KTR : ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ పై మరో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో కేంద్ర సంస్థ ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) రంగంలోకి దిగింది. కేటీఆర్ పై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదు చేసిన ఈడీ.. విదేశాలకు డబ్బు లావాదేవీలపై విచారణ జరపనుంది. ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై కేసు నమోదైంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ లో ఉన్న అంశాలనే ఈడీ ఈసీఐఆర్ లో ప్రస్తావించింది. రూ.55 కోట్ల ఆర్థిక లావాదేవీల్లో ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపై దర్యాఫ్తు చేయనుంది ఈడీ.

ఈ కార్ రేసింగ్ అంశంలో ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ ఈడీ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్ సహా పలు పత్రాలు ఇవ్వాలని ఏసీబీని కోరింది. నిబంధలనకు విరుద్ధంగా విదేశీ సంస్థకు చెల్లింపులు జరిగాయని ఆరోపణలు రావడంతో రెగులర్ ప్రాసెస్ లో భాగంగా ఈడీ ఆరా తీసింది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ సైతం కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ లో ఎవరైతే ఉన్నారో.. ఈడీ నమోదు చేసిన కేసులోనూ వారి పేర్లు పొందుపరచడం జరిగింది.

మరోవైపు ఈ కేసు విషయంలో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కార్ రేసు కేసు అంశంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. కేటీఆర్ కు ఊరటనిచ్చింది. ఈ కార్ రేసు కేసులో 10 రోజుల వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశాలు ఇచ్చింది.

Also Read : ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..