Eetela Rajender: బీజేపీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా – ఈటల
స్పష్టంగా కనిపిస్తున్నా.. అధికారికంగా తేలకపోవడంతో నెలకొన్న సందిగ్ధత సోమవారంతో ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన అనంతరం రాజేందర్ మాట్లాడారు.

Eetela Rajender Comments After Joining Bjp
Eetela Rajender: స్పష్టంగా కనిపిస్తున్నా.. అధికారికంగా తేలకపోవడంతో నెలకొన్న సందిగ్ధత సోమవారంతో ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన అనంతరం రాజేందర్ మాట్లాడారు. పార్టీలో తనకు జరిగిన అనుభవాల గురించి ప్రస్తావించారు.
‛హుజరాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి బీజేపీలో చేరాను. బీజేపీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా. చాలా సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో పని చేశా. ప్రజలకు ఉద్యమంలో మా పాత్ర ఏంటో తెలుసు’
‛రాష్ట్ర పురోభివృద్ధిలో మేధావుల సలహాలు ,సూచనలు ఉంటాయని ప్రకటించారు. కానీ ఏ రోజు కూడా సూచనలు కూడా తీసుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన అవమానాలు భరించాం. ఏ రోజు కూడా బయట పడలేదు. ఎన్నికల్లో 88 సీట్లు గెల్చుకున్నాము. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు’
‛ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అయినా కూడా కేబినెట్ వేయలేదు. కాంగ్రెస్ లో గెలిచిన శాసన సభ్యులు కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఇంటోడు బయటోడు.. బయటోడు ఇంట్లో వాడు అయ్యాడు’
‛అనేక ఘర్షణల తర్వాతే పార్టీ నుంచి బయటకు వచ్చాం. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా నాయకులను కలుపుకొని పార్టీని బలోపితం చేసేందుకు ముందుకు వెళ్తాం. గులాబీ పార్టీ నేను ఓనర్‌ని అని ఆరోజే మాట్లాడాను. సీఎం నాపై ఆరోపణలు ప్రూఫ్ చేయకపోతే ముక్కు నేలకు రాస్తారా..’
‛నా మొత్తం ఆస్తుల పై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టండి. ముఖ్యమంత్రి ఆస్తులపై, నా ఆస్తులపై కలిపి విచారణ జరపాలి. హుజూరాబాద్ లో 100 శాతం గెలుస్తామనే నమ్మకముందని’ ఈ సందర్భంగా మాట్లాడిన ఈటెల రాజేందర్ అన్నారు.