Errabelli DayakarRao : గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి.. త్వరలో కొత్త పెన్షన్లు

Errabelli DayakarRao : కర్నాటకలో రూ.500 పెన్షన్ ఇస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు.

Errabelli DayakarRao : గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి.. త్వరలో కొత్త పెన్షన్లు

Errabelli DayakarRao (Photo : Twitter, Google)

Updated On : April 18, 2023 / 7:50 PM IST

Errabelli DayakarRao : సీఎం కేసీఆర్ పాలనలో పేదల బతుకులు మారాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బీఆర్ఎస్ పాలనలో హన్మకొండ అభివృద్ధి చెందిందన్నారు. మరో ఏడాదిలో హైదరాబాద్ కు పోటీగా హన్మకొండ ఉండబోతోందన్నారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. పింఛన్ రాని వారికి త్వరలోనే అందిస్తామని హామీ ఇచ్చారు.

” సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో డెవలప్ అయ్యింది. అభివృద్ది కార్యక్రమాలు చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్ లకే దక్కుతుంది.ఆడపిల్ల పెళ్లికి మేనమామగా రూ.లక్ష ఇచ్చిన ఘనత కేసీఆర్ దే. మేనమామగా కేసీఆర్ ను ఆదరించాలి. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం రూ.500 పెన్షన్ ఇస్తోంది. కరోనా కారణంగా ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు. తెలంగాణలో మాత్రం పెన్షన్ గా రూ.2వేలు కేసీఆర్ ఇస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమీ ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు. ప్రజలు ఇది గమనించాలి” అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Also Read..Raghunandan Rao: మంత్రి నిరంజన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు

తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కేంద్ర మంత్రులు సైతం పొగిడారని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. రాష్ట్రంలో మాత్రం బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యోగాలు ఇయ్యని వారు కూడా ధర్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు చూపిస్తే దేనికైనా సిద్ధం అంటూ మంత్రి ఎర్రబెల్లి సవాల్ విసిరారు.

Also Read..Minister Harish Rao: బీజేపీ పాలిత రాష్ట్రాలది గన్ కల్చర్.. మనది అగ్రి‌‌కల్చర్ ..

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేసి ప్రజలను మోసం చేశారని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మంత్రి ఎర్రబెల్లి. తెలంగాణకు గిరిజన విశ్వ విద్యాలయం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా ఇవ్వలేదన్నారు.