Minister Harish Rao: బీజేపీ పాలిత రాష్ట్రాలది గన్ కల్చర్.. మనది అగ్రి‌‌కల్చర్ ..

డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని చెబుతున్న బీజేపీ.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంగా బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో తెలంగాణలో లాంటి పథకాలు ఉన్నాయా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.

Minister Harish Rao: బీజేపీ పాలిత రాష్ట్రాలది గన్ కల్చర్.. మనది అగ్రి‌‌కల్చర్ ..

Minister Harish Rao

Minister Harish Rao: టీఆర్ఎస్‌కు తొలి విజయం సిద్ధిపేట, బీఆర్ఎస్‌కు తొలి విజయం మునుగోడులో లభించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఎంత డబ్బు ఆశ చూపినా.. మునుగోడు ప్రజలు అభివృద్ధికోసం చూశారు. ఎన్నిసార్లు అభినందించినా తక్కువే. మీ అభిమానానికి కృతజ్ఞతలు. అందుకే 100 పడకల ఆసుపత్రి వచ్చిందని హరీష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రం అయినా తెలంగాణతో పోటీ పడగలదా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఇక్కడున్న పథకాలు అక్కడ ఉన్నాయా. వాళ్ళు ఇక్కడికి వచ్చి డబుల్ ఇంజిన్ అంటారు. డబుల్ ఇంజిన్ మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మన పథకాలు ఉన్నాయా. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు ఎందుకు రాలేదు అని హరీష్ రావు ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. జానా రెడ్డి, ఆ బ్రదర్స్ ఇక్కడే ఉన్నారు ఎందుకు మెడికల్ కాలేజీలు, బత్తాయి మార్కెట్, నిమ్మకాయ మార్కెట్ ఎందుకు రాలేదు అంటూ ప్రశ్నించారు.

సిద్దిపేట బీఆర్‌ఎస్ సభలో హరీశ్‌కు సోది చెప్పిన చిన్నారి మైత్రి

బీజేపీపై విమర్శలు ..

పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో కూడా రాజకీయం చేసే పార్టీ బీజేపీ అని హరీష్ విమర్శించారు. పొద్దున వాళ్ళే పేపర్ లీక్ చేశారు, మధ్యాహ్నం ధర్నా చేశారు, సాయంత్రం పేపర్ లీక్ కాలేదు ఎందుకు ధర్నా అన్నారు అంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శలు చేశారు. మావి పథకాలు, పనులు అయితే, బీజేపీవి కుట్రలు, పన్నాగాలు. బీజేపీ పాలిత రాష్ట్రాలది గన్ కల్చర్ అయితే.. మనది అగ్రి‌కల్చర్. బీజేపీ ఎన్ని ట్రిక్స్ చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని హరీష్ రావు దీమా వ్యక్తం చేశారు.

Harish Rao : ఏపీ మంత్రులకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ .. ఎక్కువగా మాట్లాడితే మీకే మంచిదికాదంటూ చురకలు

భట్టికి కౌంటర్..

2014-15లో రూ.3392 కోట్లతో ధాన్యం సేకరిస్తే 2020-21 నాటికి రూ.26,600 కోట్లకు చేరుకుందని హరీష్ అన్నారు. ఎరువు బస్తాలకోసం చౌటుప్పల్‌లో చెప్పులు క్యూ‌లో పెట్టేవారని అన్నారు. మహిళలు ఎందుకు మీ ప్రభుత్వానికి ఓటు వేయాలని భట్టి విక్రమార్క అడిగారు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చారు. ఈ పథకం కింద 10.26 లక్షల మంది లబ్ది పొందారు. దాదాపు 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు 13లక్షల మంది బాలింతలకు కేసీఆర్‌ కిట్లు అందుకున్నారు. నీళ్ళు మోసే భారం లేకుండా నల్లా పెట్టారు. వడ్డీలేని రుణాలు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్ ఇచ్చాము. పింఛన్ల వల్ల అత్తా కోడళ్ళ కొట్లాటలు బంద్ అయ్యాయి. అందుకే మహిళలు బీఆర్ఎస్ వైపే ఉంటారు అంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ కార్యకర్త గొప్పగా చెప్పుకునే రోజు వచ్చింది. అన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు హరీష్ రావు పిలుపునిచ్చారు.

Harish Rao : దొంగే దొంగా అన్నట్లు మోదీ మాట్లాడారు, కేసీఆర్ ఓ అద్భుత దీపం-హరీశ్ రావు

మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..

తెలంగాణ వచ్చిన తర్వాత నల్గొండ తలరాత మారిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతన్న సంతోషంగా ఉంటున్నాడంటే సీఎం కేసీఆర్ వల్లే. నాడు అన్నమే లేని జిల్లా.. నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది.. అదీ కేసీఆర్ వల్లే. తెలంగాణా సంక్షేమం, అభివృద్ధి యావత్ భారతనికి పాకిందని జగదీష్ రెడ్డి అన్నారు. గుజరాత్‌తో సహా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇక్కడి పథకాలకు డిమాండ్ పెరిగిందని అన్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలు తిరుగుబాటు కు సన్నద్ధమౌతున్నారని, హస్తిన పీఠం కదులుతుందన్న బెంగ బీజేపీకి పట్టుకుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే ఢిల్లీ బాస్‌లకు వణుకు అని జగదీష్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో పార్టీకి తావులేదని, భవిష్యత్ లో 12 స్థానాలలో గులాబీ జెండాయే ఎగురుతుందని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.