కాళేశ్వరం సబ్ కమిటీలో తుమ్మల కూడా ఉన్నా.. ఆయన్నెందుకు పిలవలేదు?: హరీశ్ రావు సంచలనం..

గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు జరగనున్న నష్టంపైనా ఒక ప్రజంటేషన్ ఉంటుందన్నారు.

కాళేశ్వరం సబ్ కమిటీలో తుమ్మల కూడా ఉన్నా.. ఆయన్నెందుకు పిలవలేదు?: హరీశ్ రావు సంచలనం..

Updated On : June 7, 2025 / 5:18 PM IST

Harish Rao: మీడియాతో చిట్ చాట్ లో మాజీమంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఎంపీ ఈటల రాజేందర్ చెప్పిన విషయాలను ఆయన ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థికశాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చామని తెలిపారు. అర్థిక శాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ అనటం సరైంది కాదన్నారు. ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా ఉండదని చెప్పారు. ఈటల రాజేందర్ కు కొన్ని గుర్తు ఉండకపోవచ్చన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నియమించిన సబ్ కమిటీలో ఈటల, తుమ్మల, తాను ఉన్నామని ఆయన తెలిపారు. సబ్ కమిటీ రిపోర్ట్ పై తనతో పాటు ఈటల, తుమ్మల కూడా సంతకం చేశారని పేర్కొన్నారు. తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణకు పిలవాలి కదా అని హరీశ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపైనా త్వరలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తానని హరీశ్ చెప్పారు.

Also Read: తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సర్వం సిద్ధం..

గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు జరగనున్న నష్టంపైనా ఒక ప్రజంటేషన్ ఉంటుందన్నారు. బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ ఏపీతో కుమక్కయ్యారని హరీశ్ ఆరోపించారు. తన దగ్గర మరొక డాక్యుమెంట్ ఉందన్న హరీశ్.. కమిషన్ దగ్గర అది బయటపెడతానని చెప్పారు. వాళ్ళు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ రాత పూర్వకంగా ఇస్తానని హరీశ్ వెల్లడించారు.