మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు.. ఏమని వార్నింగ్ ఇచ్చారంటే..
తన పరువుకు భంగం కలిగేలా కొండా సురేఖ ఆరోపణలు చేశారంటూ..

Ktr Legal Notice (Photo Credit : Google)
Ktr Legal Notice : మంత్రి కొండా సురేఖకు మాజీమంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో పాటు నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై తన పరువుకు భంగం కలిగేలా కొండా సురేఖ ఆరోపణలు చేశారంటూ లీగల్ నోటీసులు పంపించారు కేటీఆర్. 24 గంటల్లోగా కొండ సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా వేస్తానని లీగల్ నోటీసుల్లో హెచ్చరించారు కేటీఆర్.
ఈ ఉదయం నుంచి కూడా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. కొండా సురేఖ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని అటు బీఆర్ఎస్ నేతలు, ఇటు కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. లీగల్ నోటీసులు పంపారు. ఆ నోటీసులు అందిన 24 గంటల లోపు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మంత్రి కొండా సురేఖను కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే, తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. అంటే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తానని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు కేటీఆర్. గతంలో కూడా నాలుగైదు నెలల క్రితం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఒకసారి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత కోర్టు సూచనలతో కొండా సురేఖ సైలెంట్ అయ్యారు.
ఇవాళ ఒక్కసారిగా అక్కినేని నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంలోకి కేటీఆర్ ని లాగుతూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సమంతకు మద్దతుగా వారంతా నిలిచారు. నీచమైన రాజకీయాలు అంటూ విరుచుకుపడ్డారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ధీటుగా రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. చట్టపరంగానే తాను ముందుకు వెళ్లాలని కేటీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
కొండా సురేఖ గతంలోనూ ఇలానే తప్పుడు విమర్శలు చేసి తన వ్యక్తిగత ఇమేజ్ ను దెబ్బతీశారని, మరోసారి అదే రీతిలో తన వ్యక్తిగత ఇమేజ్ ను దెబ్బతీసేలా కొండా సురేఖ మాట్లాడారని కేటీఆర్ ధ్వజమెత్తారు. గతంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళితే, ఎన్నికల సంఘం కొండా సురేఖను సీరియస్ గా మందలించిన విషయాన్ని కూడా కేటీఆర్ లీగల్ నోటీసుల్లో ప్రస్తావించారు.
నాగచైతన్య- సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. కొండా సురేఖ వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి. వీటిపై నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత్ర సైతం తీవ్రంగా స్పందించారు. విడాకులు అనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం, అది ఇద్దరి అంగీకారంతో, ఎటువంటి రాజకీయ కుట్ర లేకుండా జరిగింది, దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా పెట్టండి అని సమంత విజ్ఞప్తి చేశారు.
Also Read : నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం.. కొండా సురేఖ సంచలన ఆరోపణలు..