MLC Election Counting : ఉత్కంఠగా నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్…చివరి దశకు ఎలిమినేషన్ ప్రక్రియ
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నాలుగవ రోజు కొనసాగుతుంది. నిన్న ఉదయం రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.

Mlc Election Counting
Nalgonda MLC Election Counting : నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నాలుగవ రోజు కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికి.. ఏ అభ్యర్థి కొటా ఓట్లు సాధించకపోవడంతో నిన్న ఉదయం రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఇప్పటి వరకు 66 మంది అభ్యర్థులను ఎలిమినెట్ చేయగా మరో ముగ్గురి ఎలిమినేషన్ జరగాల్సి ఉంది.
ప్రస్తుతం టిఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి 25 వేల ఓట్ల ఆధిక్యం లో కొనసాగుతున్నారు. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఈ రోజు సాయంత్రానికి పూర్తి కావచ్చని.. రాత్రి కి అంతిమ ఫలితం ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. రెండవ ప్రాధాన్యత ఓట్ల లోనూ ఎవరు కోటా ఓట్లను చేరుకోకపోతే.. మెజార్టీ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.