కరోనా భయం : కొత్తగూడెం DSPపై ప్రజల శాపనార్థాలు..ఎంతమందికి అంటించాడో

పేరుకు పోలీసు శాఖలో పెద్ద ఉద్యోగం..కానీ చటాక్ అంత బుద్ధి లేదు..నీవు మునిగావు..మమ్మల్ని ముంచావు..కొత్తగూడెం వాసులు ఇలాగే తిట్టుకుంటున్నారు. నీ జీవితంతో పాటు మా ప్రాణాలను రిస్క్ లో పెట్టావంటూ శాపనార్థాలు పెడుతున్నారు. జనాల ఆవేదనలో అర్థం ఉంది…వారి ఆక్రోషంలో న్యాయం ఉంది..ఎంతో బాధ్యత గల పోలీసు శాఖలో డీఎస్పీ చేసిన పనిని చీదరించుకుంటున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు..పశ్చిమ గోదావరి జిల్లాలోని లక్షలాది మంది బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. కరోనా వైరస్ నివారించేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. లాక్ డౌన్ విధించింది. ప్రజలు రోడ్ల మీదకు రాకుండా ఉండేందుకు పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. కొన్ని రోజుల పాటు ఇళ్లలోనే ఉంటే..చాలు..అంటూ సాక్షాత్తూ..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లు కోరుతున్నారు.
కానీ కొత్తగూడెం డీఎస్పీ మాత్రం..అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి..జిల్లా మొత్తాన్ని…రిస్క్ లో పెట్టాడు. అతని కుటుంబంతో పాటు వేలాది కుటుంబాల భవిష్యత్ ని ఫణంగా పెట్టాడు. విదేశాల నుంచి వచ్చిన కుమారుడిని ఇంటిలోనే ఉంచకూడదనే సోయి లేకుండా….ప్రవర్తించాడు.
అతని ఇంట్లో మొత్తం ముగ్గురికి (కుమారుడితో కలిపి) వైరస్ అంటుకుంది. వీరితో పాటు మరెంత మందికి వైరస్ సోకిందనే భయాలు కమ్ముకున్నాయి. ఈ లెక్క తేల్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం పరుగులు పెడుతోంది. ఒక్కడు నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదం వస్తుందనేది డీఎస్పీ చేసిన వ్యవహారాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా వ్యాప్తికి కారకుడైన డీఎస్పీపై కేసు నమోదు.
* డీఎస్పీపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన సీఐ రాజు.
* సీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీపై వన్ టౌన్ పీఎస్ లో డీహెచ్ఎంవో ఫిర్యాదు.