Motinagar Fire Accident : హైదరాబాద్ మోతీనగర్‌లో తప్పిన పెను ప్రమాదం.. అపార్ట్‌మెంట్‌పై చెలరేగిన మంటలు, పరుగులు తీసిన ప్రజలు
హైదరాబాద్ మోతీనగర్ లో దీపావళి వేడుకల్లో పెను ప్రమాదం తప్పింది. దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాలుస్తుండగా ఓ అపార్ట్ మెంట్ పై ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.

Motinagar Fire Accident : హైదరాబాద్ మోతీనగర్ లో దీపావళి వేడుకల్లో పెను ప్రమాదం తప్పింది. దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాలుస్తుండగా ఓ అపార్ట్ మెంట్ పై ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న సెల్ టవర్ కూడా మంటలు వ్యాపించడంతో అపార్ట్ మెంట్ వాసులు, స్థానికులు హడలిపోయారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఏం జరుగుతుందోనని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సకాలంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. లేకపోతే కనుక మంటలు అపార్ట్ మెంట్ కు పాకి పెద్ద ప్రమాదం జరిగుండేదని స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు హైదరాబాద్ దీపావళి వేడుకల్లో అపశ్రుతి జరిగింది. అజాగ్రత్తగా టపాసులు పేల్చుతూ పలువురు గాయపడ్డారు. కంటి సమస్యలతో బాధపడుతున్నారు. బాధితులంతా సరోజినీదేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. ఇప్పటివరకు పది మంది చేరినట్లుగా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. బాధితుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు. బాధితుల సంఖ్య పెరగడంతో సరోజినీదేవి ఆసుపత్రి వర్గాలు అప్రమత్తం అయ్యాయి. రాత్రి అదనంగా డాక్టర్లను, సిబ్బందిని విధుల్లో ఉంచారు.