మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం, రైలు నుంచి పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలు

fire accident in medchal railway station: హైదరాబాద్ మేడ్చల్ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న రైలు నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో పలు బోగీలు దగ్దం అయ్యాయి. రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగిందా లేక మరో కారణమా అనేది తెలియాల్సి ఉంది.
వెంటనే రంగంలోకి దిగిన స్టేషన్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్టేషన్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మొదటి బోగీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడినట్లు తెలుస్తోంది. రైలుకి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మంటలు వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో స్టేషన్ లో పక్కనే నిలిపి ఉంచిన రైళ్లకు మంటలు అంటుకోకుండా జాగ్రత్తలు చేపట్టారు.
సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 10 బోగీలు తగలబడ్డాయి.