Bangalore Express Train : బెంగళూరు ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం

ఒడిశా రైలు ప్రమాద ఘటన మరువకముందే బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు చక్రాల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు.

Bangalore Express Train : బెంగళూరు ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం

Bangalore Express

Updated On : June 7, 2023 / 7:13 AM IST

Express train fire : బెంగళూరు ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి కాచిగూడ నుంచి బెంగళూరుకు బయల్దేరిన ఎక్స్ ప్రెస్ రైలు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ రైల్వేస్టేషన్ వద్ద సడెన్ బ్రేక్ వేయడంతో రైలు చక్రాల్లో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పి వేశారు. దీంతో ప్రమాదం తప్పింది.

Major Train Accident Averted: డ్రైవర్ బ్రేక్ వేయడంతో తప్పిన పెద్ద రైలు ప్రమాదం

ఒడిశా రైలు ప్రమాద ఘటన మరువకముందే బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు చక్రాల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. అయితే ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 15 నిమిషాల తర్వాత రైలు బెంగళూరుకు బయల్దేరింది.