TSRTC Bus Fire Accident : హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం

ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.

TSRTC Bus Fire Accident : హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం

Bus Fire

Updated On : July 7, 2023 / 7:19 AM IST

Fire Broke Out : హైదరాబాద్ లో టీఎస్ఆర్టీసీ రాజధాని బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని విజయవాడ హైవేపై రన్నింగ్ లో ఉన్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఏసీలో నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశారు.

ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

Fire Breaks Out : ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం, నలుగురి మృతి

సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.