Khammam Cotton Market : ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగింది?

అగ్నిప్రమాద ఘటనపై విచారణ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల.

Khammam Cotton Market : ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగింది?

Updated On : January 16, 2025 / 1:03 AM IST

Khammam Cotton Market : ఖమ్మం పత్తి మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మార్కెట్ యార్డ్ షెడ్ లో పత్తి బస్తాలు దగ్గమయ్యాయి. 400కు పైగా బస్తాలు మంటల్లో కాలిపోయాయి. ఖరీదైన పత్తి మంటల్లో కాలిపోవడంతో వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.

పత్తి దగ్ధం ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. పోలీసు కమిషనర్, మార్కెట్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి తుమ్మల. అగ్నిప్రమాద ఘటనపై విచారణ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల.

”ఇద్దరు ట్రేడర్స్ కు చెందిన పత్తి బస్తాల మంటల్లో కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ అయినట్లుగా వైరు కనిపిస్తోంది. పూర్తి విచారణ జరిపాక అగ్నిప్రమాదానికి గల కారణం ఏంటనే వివరాలు వెల్లడిస్తాం. అగ్నిప్రమాద ఘటన చాలా దురదృష్టకరమైనది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం” అని వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ హనుమంతరావు తెలిపారు.

Also Read : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ దూకుడు.. ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారా?

అతి కష్టం మీద మంటలను అదుపు చేసినట్లుగా తెలుస్తోంది. ట్రేడర్లు కొనుగోలు చేసిన పత్తి మంటల్లో కాలిపోయింది. కళ్ల ముందే ఖరీదు చేసిన పత్తి కాలి బూడిదగా మారటంతో వ్యాపారులు తీవ్ర ఆవేదన చెందారు. పత్తి మార్కెట్ లో సంభవించిన అగ్నిప్రమాదం కలకలం రేపింది.