ఫైవ్ మెన్ కమిటీ సమావేశం.. మిడతల దండును అరికట్టడంపై చర్చ

  • Published By: srihari ,Published On : May 29, 2020 / 12:09 PM IST
ఫైవ్ మెన్ కమిటీ సమావేశం.. మిడతల దండును అరికట్టడంపై చర్చ

Updated On : May 29, 2020 / 12:09 PM IST

తెలంగాణపై దండెత్తబోయే మిడతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం నియమించిన ఫైవ్ మెన్ కమిటీ పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ గెస్ట్ హౌజ్ లో సమావేశం అయ్యారు. మిడతల దండును అరికట్టేందుకు కేసీఆర్ సర్కార్ ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. మిడతలను ఎలా అడ్డుకోవాలి? ఎలా అరికట్టాలనే దానిపై చర్చిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీలో సీఐపీఎమ్ ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి సునీత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్, సైంటిస్ట్ రహమాన్, వరంగల్ ఫారెస్టు అధికారి అక్బర్, రామగుండం సీపీ సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి ఉన్నారు. 

వీరంతా హెలికాప్టర్ లో అదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు ప్రయాణించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ ఫైవ్ మెన్ కమిటీ నాలుగు రోజులపాటు రామగుండంలోనే బస చేయనుంది. మిడతల దండు ఎప్పటికప్పుడు అంచనా వేయడంతోపాటు అవి రాకుండా అడ్డుకునే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం వేసింది. కొద్ది సేపటి క్రితమే కమిటీకి సంబంధించిన ఐదుగురు సభ్యులు రామగుండం ఎన్టీపీసీకి సంబంధించిన జ్యోతి భవన్ లో సమావేశం అయ్యారు. 

మిడతల దండు ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలి? ప్రభుత్వం సూచించిన విధంగా పరిసర ప్రాంతాల రైతులతో అధికారులను ఏవిధంగా సమాయత్తం చేయాలని చర్చిస్తున్నారు. సమావేశం కొనసాగుతుంది..సమావేశం పూర్తయ్యాక ఏదైతే ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు పూర్తిగా పర్యవేక్షించనున్నారు. మిడతల రాకకు సంబంధించిన అంశాలతో పాటు మిడతలు వస్తే ఏ విధంగా చర్యలు చేపట్టాలి? అడ్డుకునేందుకు పరిసర ప్రాంతాలల్లో ఏవిధమైన ద్రావణాలను స్ప్రే చేయాల్సివుంటుందన్న అంశంపై చర్చిస్తున్నారు.

డ్రోన్ కెమెరాలను సిద్ధం చేశారు. అక్కడున్న కొంతమందిని డప్పులతో సిద్ధంగా ఉండాలని సూచించారు. వారితోపాటు ఈ ఐదుగురు కమిటీ సభ్యులు పూర్తిగా మిడతల నివారణ చర్యలను అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందిస్తూ ముందుకు వెళ్లేందుకు వీరంతా సమాయత్తం అయ్యారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా సూచనలు చేసింది. రేపు ఉదయం వీరంతా హెలికాప్టర్ ద్వారా తమ పర్యవేక్షణ కొనసాగించే అవకాశం ఉంది.