పునరావాసాలకు వరద బాధితులు..

  • Published By: sreehari ,Published On : October 14, 2020 / 10:25 PM IST
పునరావాసాలకు వరద బాధితులు..

Updated On : October 15, 2020 / 7:08 AM IST

Floods victims : భారీ వర్షాలతో హైదరాబాద్ అతులాకుతలమైంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో నగరంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి.



నగరవాసుల్లో చాలామంది వరదలో చిక్కుకుపోయారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ఆయా ప్రాంతాల ప్రజలను అధికారులు సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.



ఆహార పదార్థాలను అందిస్తున్నారు. పలు చోట్ల ప్రభుత్వం సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. ఆహారంతో పాటు అవసరమైన వైద్య సదుపాయం కల్పిస్తున్నారు.



ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి పర్యటించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.