లాక్ డౌన్ పై ఓవైసీ ట్వీట్ : పొడిగిస్తే..ముందు ఇవి చేయ్యండి

భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతుందా ? ఏప్రిల్ 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో విధించిన గడువు ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పలు రాష్ట్రాలు గడువును మరో రెండు వారాల పాటు పొడిగించాలని విన్నవిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. లాక్ డౌన్ పొడిగిస్తే..మాత్రం ముందు పలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.(సీఎంలతో మోడీ : మాస్క్ లు ధరించి వీడియో కాన్ఫరెన్స్ )
ఎలాంటి ప్రణాళిక లేకుండా విధించిన లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా కార్మికులు, వలస కూలీలు తీవ్ర బాధలు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారాయన. ఒకవేళ కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించాలని అనుకుంటే..మొదట ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కార్మికుడికి రూ. 5 వేలు, అన్నార్థులకు సరిపడా ఆహారపదార్థాలు, వలస కూలీలకు, నిరుపేదలను ఆదుకొనేందుకు రాష్ట్రాలకు తగినన్ని నిధులు ఇవ్వాలన్నారు.
సీఎంలతో సమావేశానంతరం ప్రధాని మోదీ మరోసారి జాతి ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో మళ్లీ ఆయన కీలక ప్రకటన చేయనున్నారు. లాక్‌డౌన్ కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే.. ప్రస్తుత లాక్‌డౌన్‌లో కొన్ని మార్పులు చేసే అవకాశాముందన్న టాక్ వినిపిస్తోంది. అంతర్‌రాష్ట్ర రవాణా మాత్రం పూర్తిగా నిలిపివేయనుండగా… కేవలం నిత్యావసరాల కోసమే వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారని తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, మందిరాలన్నీ మూసివేస్తారు. కొన్ని కంపెనీలకు సడలింపు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా మోడీ శనివారం ఎలాంటి ప్రకటన చేయనున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది
. @PMOIndia Unplanned lockdown has caused needless pain to India’s workers & migrants. If you’re extending this lockdown then ensure:
??Every worker gets ₹5k
??Excess food stock is released to feed hungry
??States get more cashFocus on saving lives, the economy is secondary https://t.co/IYH5BB41oP
— Asaduddin Owaisi (@asadowaisi) April 11, 2020