Fish Land Kitchen : ఫిష్‌ల్యాండ్‌ కిచెన్‌లో ఎలుకలు.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

Fish Land Kitchen : హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని పలు రోజుల నుంచి అధికారులు సూచనలు చేస్తున్నారు.

Fish Land Kitchen : ఫిష్‌ల్యాండ్‌ కిచెన్‌లో ఎలుకలు.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

Food Safety Officers Raids on Hotels

Updated On : June 2, 2024 / 6:56 PM IST

Fish Land Kitchen : హైదరాబాద్‌లోని పలు హోటల్స్, రెస్టారెంట్లు, బార్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. లక్డీకాపుల్లోని హోటల్ అశోక, కిచెన్ అప్ మూన్ లైట్ బార్, హైడ్రేట్ ద బార్, న్యూ ఫిష్‌ల్యాండ్ హోటల్‌లో తనిఖీలు జరుగుతున్నాయి.

Read Also : నేను అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిశానా? అంటూ మంత్రి కోమటిరెడ్డికి హరీశ్ రావు సవాల్

అపరిశుభ్రంగా ఉన్న కిచెన్ గడువు ముగిసిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. హోటల్ ఫిష్ ల్యాండ్‌లోని కిచెన్‌లో ఎలుకలు తిరగడానికి అధికారులు గుర్తించారు. సింథటిక్ ఫుడ్ కలర్‌‌ను కూడా కూడా గుర్తించారు. వాటిని అక్కడే నాశనం చేశారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం.. హోటల్, రెస్టారెంట్ల అందరికీ నోటీసులు కూడా జారీ చేశారు.

హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి. బయట ఫుడ్‌ని ప్రిపర్ చేయకపోవడమే మంచిదని పలు రోజుల నుంచి అధికారులు సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఫుడ్ కలర్స్ వాడుతున్న అపరిశుభ్రమైన ఆహారాన్ని నాశనమైన ఆహారాన్ని అధికారులు గుర్తించడమే కాకుండా ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం అందరికీ కూడా నోటీసులు జారీ చేశారు.

Read Also : Kidney Racket : ఇరాన్ కిడ్నీ రాకెట్‌ సూత్రధారి బల్లంకొండ రాంప్రసాద్ అరెస్ట్‌!