Bear : హమ్మయ్య.. ఎట్టకేలకు చిక్కింది.. ఇక హాయిగా నిద్రపోవచ్చని ఊపిరిపీల్చుకున్న జనాలు
Bear : అది మగది. దాదాపు 110 కిలోల బరువు ఉంటుంది. దాంతో క్రమంగా మత్తు డోసు పెంచుతూ అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వరంగల్ జూ కు తరలిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

Bear(Photo : Google)
Bear In Suryapet : సూర్యాపేటలో ఎలుగుబంటి హడలెత్తించిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఎలుగుబంటి చిక్కింది. దీంతో పట్టణ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. కొన్ని గంటల పాటు తీవ్రంగా శ్రమించిన అటవీశాఖ, పోలీసు అధికారులు ఎలుగుబంటిని పట్టుకోగలిగారు. ఎలుగుబంటి బాగా బలంగా ఉంది. అది మగది. దాదాపు 110 కిలోల బరువు ఉంటుంది. దాంతో క్రమంగా మత్తు డోసు పెంచుతూ ఎలుగుబంటిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఎలుగుబంటిని వరంగల్ జూ కు తరలిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
సూర్యాపేటలో ఎలుగుబంటి కలకలం రేపింది. డీమార్ట్ వెనకాల నిర్మాణంలో ఉన్న భవనంలోకి భారీ ఎలుగుబంటి ప్రవేశించింది. ఎలుగు బంటిని రెస్క్యూ చేయడానికి కొన్ని గంటల పాటు అటవీశాఖ, పోలీసు అధికారులు తీవ్ర శ్రమించారు. రెస్క్యూ ఆపరేషన్ ను మంత్రి జగదీశ్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు.
Also Read..Boy Dead : చాక్లెట్ దొంగిలించాడని బాలుడిని కొట్టిన మాల్ మేనేజర్.. కాసేపటికే ఊహించని ఘోరం
సూర్యాపేట పట్టణంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి ఎలుగుబంటి చొరబడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. డీమార్ట్ వెనకాల నిర్మాణంలో ఉన్న భవనంలోకి శనివారం రాత్రి ఆ ఎలుగుబంటి ప్రవేశించి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న తండు శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి ఎలుగుబంటి తొలుత ప్రవేశించింది. ఇంట్లో ఉన్న వారు ఒక్కసారిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయి పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలోకి ప్రవేశించింది.
తొలుత శ్రీనివాస్ ఇంట్లోని బాత్రూమ్ లోకి ఎలుగుబంటి చేరింది. ఇంట్లోని వారు కేకలు వేయటంతో అది పారిపోయి నిర్మాణంలో ఉన్న భవనంలోకి దూరింది. రాత్రి మెుత్తం ఆ భవనంలోనే తిష్ట వేసింది. హడలిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. కొన్ని గంటల పాటు తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు భల్లూకాన్ని బంధించగలిగారు.
అయితే పట్టణ ప్రాంతంలో నిత్యం ప్రజలు తిరుగుతూ ఉండే చోటుకి ఎలుగుబంటి ఎలా వచ్చిందనేది చర్చనీయాశమైంది. అడవిలో ఉండాల్సిన జంతువులు జనావాసాల మధ్యలోకి వస్తుండటంతో.. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, వేసవి నేపథ్యంలో ఎండవేడిని భరించలేక వన్య ప్రాణులు ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు.
పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం తీవ్ర కలకలం రేపింది. కాగా, అడవుల్లో ఉండాల్సిన వన్య ప్రాణులు, క్రూర మృగాలు ఇలా జనావాసాల్లోకి వచ్చేస్తూ ఇళ్లలోకి దూరుతుండటంతో జనం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని కంగారుపడిపోతున్నారు. రాత్రి పూట ఒంటరిగా బయట తిరగాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అధికారులు స్పందించి.. రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.